Kcr 100 days ruling in telangana review

trs, kcr, telangana, kalvakuntla chandrashekar rao, 100days, telangana state, government, hyderabad, police, hyderabad police, telangana ministers, telangana mlas, latest news

kcr completed 100days as chief minister of telangana : trs government completed 100days in telangana leaders says more effective benifits in future

తెలంగాణ ప్రభుత్వానికి 100రోజులు

Posted: 09/09/2014 10:54 AM IST
Kcr 100 days ruling in telangana review

ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు.., విద్వంసాలు, వివాదాలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం తీసుకుంటే ఇదే కన్పిస్తుంది. ఇలా ఉద్యమాల అడుగులు దాటుకుని జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. ఉద్యమానికి రాజకీయ రంగును తీసుకువచ్చిన టీఆర్ఎస్ తొలి తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటయి వంద రోజులు గడుస్తుంది. ఈ సందర్బంగా మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి.

రుణమాఫీ ఎక్కడ.. ఎప్పుడు?

జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.., రాష్ర్ట ఆవిర్బావ వేడుకల్లో ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది రైతు రుణమాఫీ. లక్షరూపాయల లోపు రుణం తీసుకున్న రైతుల అప్పులు మాఫీ చేస్తామని హామి సారాంశం. ఎన్నికల మ్యానిఫఎస్టోలో పేర్కొన్న విధంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత చాలా గందరగోళాలు జరిగాయి. రుణ మాఫీ అంటే కేవలం పంట రుణాలపై మాత్రమే వర్తిస్తుందనీ.., బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలకు వర్తించదని చెప్పారు. మళ్లీ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ మద్య కొత్తగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో రుణం తీసుకుంటేనే మాఫీ వర్తిస్తుందని కొత్త నిబంధనలు పెడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.., రిజర్వు బ్యాంకు రుణమాఫికి అంగీకరిచమని స్పష్టం చేసింది. తెలంగాణలో గతంతో పోలిస్తే పంట దిగుబడిలో పెద్దగా తేడాలు లేకపోవటంతో పాటు కొన్ని పంటల ఉత్పత్తి పెరిగినందున రుణ మాఫి ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించింది.

అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామి కోసం కేసీఆర్ బాగానే కష్టపడుతున్నారు. సొంతంగా రుణమాఫి చేసుకుంటామని చెప్తున్నారు. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. అయితే రుణమాఫి ఎప్పుడు చేస్తారు అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు పూర్తయినా ఇంతవరకు ప్రధాన హామినే అమలు చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇక మన ఊరు మన ప్రణాళిక అని కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే అని చెప్పవచ్చు. మొదట్లో కొన్నిరోజులు చేపట్టిన ఈ కార్యక్రమం ఆ తర్వాత ఊసేలేదు. అందులో వచ్చిన విజ్ఞప్తుల పరిశీలన మాట చంద్రశేఖరుడికే తెలియాలి.

పోలిసులను మెప్పించారు

ప్రభుత్వం ఇచ్చిన హామిల్లో పోలిసు శాఖకు ప్రకటించిన తాయిలాలు మాత్రం అందుతున్నాయి. ఇందులో ప్రధానమైనది వారంలో సెలవు రోజు. గతంలో పోలిసులకు వారంలో సెలవు రోజు అనే నిబంధన ఉండేది కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.., వారంలో ఖచ్చితమైన సెలవు రోజును అమలు చేస్తున్నారు. ప్రతి పోలిసుకు వారంలో ఒక రోజు వేతనంతో కూడిన సెలవు దినంగా ఇస్తున్నారు. దీంతోపాటు బ్రాండ్ హైదరాబాద్ ప్రకటనలో భాగంగా హైదరాబాద్ పోలిసులకు కొత్త వాహనాలు, బైకులు అందించారు. పోలిసుల లోగోలను కూడా మార్చేశారు.

స్థానికత-సర్వే-సంచలనం

అయితే ప్రభుత్వం పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. వీటిపై ఇప్పటికీ స్పష్టత రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానమైనది స్థానికత అంశం. 1956కు పూర్వం ఉన్నవారే తెలంగాణ స్థానికులుగా ప్రభుత్వం చెప్తోంది. వీరికే ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చింది. స్థానికతను తెలుసుకునే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రజలందర్నీ ఒకే రోజు సర్వే చేసి దేశంలో సంచలనమే సృష్టించింది. సర్వేపై పెద్ద దుమార రేగింది. హోంశాఖ కూడా ఏమిటీ సర్వే అని ఆరాతీసింది. అయినా సరే వినకుండా తెలంగాణలో కుటుంబాలన్నిటినీ సర్వే చేసింది. ఇక పీజు రి ఎంబర్స్ మెంట్ విషయంలో కూడా ఏపీతో గొడవ పడింది. తమ విద్యార్థులకు మాత్రమే ఫీజు ఇస్తామని.., ఇందుకోసమే స్థానికతను తీసుకొచ్చినట్లు చెప్పింది. పీజు రీఎంబర్స్ మెంట్ కోసం కొత్తగా ఫాస్ట్ పధకం రూపొందించింది.

సమావేశాలు-సదస్సులు-సమీక్షలు

ప్రభుత్వం వంద రోజుల్లో దాదాపుగా సమావేశాలు, సమీక్షలకే కాలం వెల్లదీసింది. ప్రతి శాఖ విభజన, పనితీరు, పురోగతిపై సమీక్షలు జరిపింది. పలు సంస్థలతో సదస్సులు ఏర్పాటు చేసి తెలంగాణలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు తెచ్చుకుంది. ఇక ప్రతి విషయానికి పక్క రాష్ర్టంతో వివాదానికి దిగుతూ కేంద్రానికి కంటిలో నలుసులా మారింది. ఈ వైఖరి వల్లే ఏపీకి వచ్చినన్ని నిధులు, కేటాయింపులు తెలంగాణకు వేగంగా రావటం లేదని తెలుస్తోంది. అయినా మూడు నెలల్లో సమగ్ర అభివృద్ధి అంటే అసాద్యం. కాని ఆ దిశగా కనీసం పునాది రాళ్లయినా పడి ఉంటే తమ కలలు సాకారం అవుతున్నాయని ప్రజలు సంతోషించే వారు. కాని తెలంగాణ ప్రభుత్వం వివాదాలకే ఎక్కువగా సమయం కేటాయించటం పట్ల ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది. ఇకనైనా తగాదాలు మాని.., సుపరిపాలన, బంగారు తెలంగాణ లక్ష్యంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana  100days  latest news  

Other Articles