Why sonia and rahul not campaigning in medak bypoll

sonia gandhi, rahul gandhi, congress party, medak bypolls, telangana, aicc, inc, sunitha laxma reddy, kcr, jagga reddy, hyderbad, delhi, latest news

political leaders discussing why rahul gandhi and sonia gandhi campaigining in medak bypoll : sunitha victroy chances are thin so sonia, rahul not intrested to do campaign in telangana bypoll

సోనియా, రాహుల్ మెదక్ ఎందుకు రావట్లేదంటే..?

Posted: 09/09/2014 12:54 PM IST
Why sonia and rahul not campaigning in medak bypoll

తెలంగాణ ఇచ్చింది తామే అని ఎన్నికలకు ముందుగా గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ హైకమాండ్., ఇప్పుడీ ప్రకటన చెప్పకోవటానికి కూడా అంతగా ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే ఎన్నో కష్టాలకోర్చి ప్రతిపక్షంను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి అందర్నీ మేనేజ్ చేసి బిల్లు పాస్ చేస్తే.., తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓడించి ప్రతిఫలం చూపారు. రాష్ర్టం విభజించి ఏపీలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన కాంగ్రెస్.., తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా మారింది. ఇదంతా సరే తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలో సోనియా, రాహుల్ ప్రచారం చేయటానికి ఎందుకు రావటం లేదు? అని ప్రశ్నిస్తే సునీతా లక్ష్మారెడ్డి ఓటమికి బాద్యత వహించటం ఇష్టం లేకనే అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.., తెలంగాణలో మాత్రం చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా నామమాత్రపు సీట్లు సాధించి ఉనికి కాపాడుకుంది. కలిసిపోతామని చెప్పి చివర్లో షాకిచ్చిన కారు దెబ్బకు చేయి నలిగిపోయింది. సాధారణంగా అయితే ఇలా చేస్తే ఎవరైనా అవతలివారిని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూస్తారు. కాంగ్రెస్ వారికయితే ఈ సంగతి చెప్పనక్కర్లేదు. టైం చూసి సీబీఐ, ఈడి వంటి సంస్థలను పట్టుకుని భయపెట్టి లోబర్చుకోవటం వారిదగ్గరే నేర్చుకోవాలి. కాని తెలంగాణ ఉప ఎన్నికలో అది జరగటం లేదు. ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ రావటం లేదు. తప్పదన్నట్లుగా దిగ్విజయ్ వచ్చి సునితను అభ్యర్ధిగా ఖరారు చేసి వెళ్ళిపోయారు.

ప్రచారంలో కూడా నేతలెవరూ పెద్దగా సునీతకు సహకరించటం లేదు. పార్టీ నుంచి ఆర్ధిక సాయం కూడా అందటం లేదని సన్నిహితులంటున్నారు. పార్టీకోసం పోటి చేస్తున్న సునీత లక్ష్మారెడ్డికి నేతలు సహకరించకపోవటంపై పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కోటలో పోటి చేసి గెలవటం అంటే కలగా భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఓటమికి బాధ్యత వహించటం ఇష్టం లేకనే దూరంగా ఢిల్లీకి పరిమితం అయిందని తెలుస్తోంది. సాక్షాత్తు సోనియా వచ్చి ప్రచారం చేసినా గెలవలేదనే పేరు తెచ్చుకోవటం ఇష్టం లేకనే వారు మెదక్ వైపు చూడటం లేదని చెప్తున్నారు. ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న సునీత మరి ఏ మేరకు ఓట్లు సాధిస్తారో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  rahul gandhi  medak bypoll  latest news  

Other Articles