Telangana government has decided to divide 10 districts in telangana to 24

telangana government, telangana cm kcr, kcr latest news, kcr news, kcr latest press meetn, telangana districts, telangana new districts, political party news

telangana government has decided to divide 10 districts in telangana to 24

కొత్తజిల్లాలు పరిపాలన కోసమా.. పట్టుకోసమా?

Posted: 09/09/2014 01:13 PM IST
Telangana government has decided to divide 10 districts in telangana to 24

విభజన అనంతరం 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే ఒక్కో జిల్లాలను రెండులేదా మూడు జిల్లాలుగా విడదీస్తేనే (పునర్విభజన) సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గతంలో చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లాలను విడదీసేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పది జిల్లాల పునర్విభజనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న 10 జిల్లాలను 24 విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న కొత్త జిల్లాల వివరాలు ఇవే...

1. హైదరాబాద్ జిల్లాను... చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ జిల్లాలుగా
2. మహబూబ్ నగర్ జిల్లాను... మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలుగా
3. మెదక్ జిల్లాను... సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలుగా
4. ఆదిలాబాద్ జిల్లాను... మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలుగా
5. ఖమ్మం జిల్లాను... కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలుగా
6. నల్లగొండ జిల్లాను... సూర్యాపేట, నల్లగొండ జిల్లాలుగా
7. వరంగల్ జిల్లాను... వరంగల్, భూపాలపల్లి, జనగాం జిల్లాలుగా
8. రంగారెడ్డి జిల్లాను... వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలుగా
9. కరీంనగర్ జిల్లాను... కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విడదీస్తున్నారు.
10. నిజామాబాద్ జిల్లాను... నిజామాబాద్ గానే ఉంచుతున్నారు.

అయితే, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్ ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనకు త్వరలో రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. ఆ తర్వాత దాన్ని చట్టరూపంలో ప్రవేశపెట్టి కేంద్రానికి నివేదిస్తారు. కేంద్రం అంగీకారం తెలపగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. ఇదిలావుండగా.. ఈ విధంగా జిల్లాల విభజనపై పలురకాలు విమర్శలు, అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

పరిపాలన వికేంద్రీకరణ... జిల్లాలను ఇలా విడదీయడం వల్ల సదరు జిల్లాల్లో జనాభా చాలా తక్కువ మోతాదులో వుంటుంది కాబట్టి.. వారందరికీ తగిన సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సులభతరం అవుతుందనే భావంతో ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం అభిప్రాయం. అలాగే జిల్లాలను త్వరితంగా అభివృద్ధి చేయడానికి, అక్కడ కావాల్సిన సంస్థలను నిర్మించడానికి చాలా అనువుగా వుంటుందని.. ఈ తరహాలోనే అన్ని జిల్లాల్లోనూ రకరకాల పరిశ్రమలను నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయవచ్చుననే భావనతోనే తెలంగాన ప్రభుత్వం సదరు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణాలో పట్టుకోసం...

అయితే తెలంగాణాలో ఇలా జిల్లాలను విడదీయడం వల్ల తమ టీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చుననే భావనతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాల అభిప్రాయం. ప్రస్తుతం 10 జిల్లాల్లో వున్న నాయకుల సంఖ్య పదవుల సంఖ్య 24 జిల్లాలు ఏర్పడినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే ఆశతో ఇలా జిల్లాలను విభజిస్తున్నారని విశ్లేషకుల ఆలోచన! ఏదిఏమైనా.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు ప్రజలకు, పార్టీకి లాభం జరుగుతుందని చెప్పవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana government  trs party  kcr  telangana districts  

Other Articles