Navratilova to marry julia lemigova

navratilova, navratilova hot, navratilova tennis matches, sports news julia lemigova, marriage, lesbian, gay, transzender, lgbt, latest news, miss india, miss russia, ussr, miss universe, women hot, models hot photos

tennis star navratilova announced her marriage with former miss ussr julia lemigova : lesbian marriage between navratilova and julia lemigova

రష్యా సుందరిని పెళ్ళాడనున్న టెన్నిస్ తార

Posted: 09/10/2014 11:47 AM IST
Navratilova to marry julia lemigova

టెన్నిస్ ఆటలో రారాణిగా పేరు పొంది.., సంచలనాలకు కేరాఫ్ గా మారిన నవ్రతి లోవా మరో సంచలనానికి తెరతీసింది. రష్యా భామ దేశ మాజి సుందరి, మిస్ యునివర్స్ రన్నరప్ జూలియా లెమిగోవాను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. అదేమిటి అమ్మాయిని చేసుకుంటుంది అనుకుంటున్నారా.., అదేమరి నవ్రతి అంటే. లెస్బియన్ అయిన టెన్నిస్ తార రష్యా భామను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటుంది. సజాతి దృవాలు ఆకర్షించుకోవు అనే అయస్కాంత సిద్ధాంతం తమకు వర్తించదంటూ అమ్మాయిని పెళ్ళి చేసుకుని సంసార జీవితం చేసేందుకు సిద్దమయింది కూడా.

ఇక పెళ్ళి కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతానికి వెళ్తున్నారు. అదే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ర్టంలో ఉన్న కౌంటి మయామి డేడ్. రాష్ర్టంలో స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహం చట్టరిత్యా అనుమతించబడే ఏకైక ప్రాంతం ఇది. ఇక్కడే ఇద్దరూ ఆడాళ్లూ ఒక్కటవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. సగం జీవితం పూర్తి చేసుకున్న ఈ తార జులియాతో ఆరేళ్ల పాటు సహజీవనం చేసింది కూడా. ‘‘జూలియా లేని జీవితాన్ని జీవించటం కాదు కనీసం ఊహించటం కూడా తన వల్ల కాదని చెప్తోంది నవ్రతి లోవా. అందుకే దయచేసి తనను పెళ్ళి చేసుకోవా’’లని పబ్లిక్ గా అడిగేసింది. ఇంతలా ప్రాదేయపడుతున్న లోవాకు లెమిగోవా జీవిత భాగస్వామి అవుతానని వరం ప్రసాదించింది.

ఇక వీరిలో ఎవరు భార్య, ఎవరు భర్త అనే విషయానికి వస్తే.., మేం ఇద్దరం సమానమే అని చెప్పుకుంటున్నారు. కానీ వయస్సు ప్రకారం చూస్తే నవ్రతి లోవాకు 57సంవత్సరాలు, రష్యా సుందరి లెమిగోవాకు జస్ట్ 42ఏళ్లు. ఇద్దరు ముద్దుగుమ్మల్లో నవ్రతి వయస్సు ఎక్కువ కావటంతో ఆమె భర్తగా భావించాలన్నమాట. స్వలింగ జీవితంపై లోవాకు గతానుభవ కూడా బాగానే ఉంది. జూలియా లెమిగోవాతో సహజీవనానికి ముందు మరో ముద్దు గుమ్మతో ఏడేళ్లు కలిసి జీవించింది. అయితే ఇద్దరి మద్య పొసగక 1991లో సజాతి బంధం విడిపోయింది.

వీళ్లకు ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే విడిపోవటంపై చర్చ మొదలయింది. గతానుభవం వల్ల ఈ బంధం ఎన్నాళ్లు ఉంటుందో.., ఇద్దరి దాంపత్య జీవితం ఎన్నేళ్లు నిలుస్తుందో అని విమర్శకులు పెదవులు చప్పరించుకుంటున్నారు. ప్రేమ గుడ్డిది అని తెలుసు కాని మరీ మగా.., ఆడా.., లేక తేడా? అని చూడలేనంత గుడ్డిది అని వీరిని చూస్తేనే అర్ధమవుతుంది. ఇదేమైనా ‘‘ఆల్ ఇట్స్ పాజిబుల్ ఇన్ లవ్’’. ఎందుకంటే ‘‘ఇట్స్ లవ్’’ అనుకోక తప్పదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : navratilova  julia lemigova  lesbian  latest news  

Other Articles