Vijayawada will not be capital of andhrapradesh

andhrapradesh, andhrapradesh capital, ap capital, vijayawada, vijayawada ap capital, vgtm area, latest news, house rents in vijayawada, kurnool, seemandhra movement, capital war, chandrababu naidu, andhrapradesh government, shivaramakrishan committee, supreme court, justice laxman reddy, kadapa, rayalaseema

capital issue still become a hurdle for andhrapradesh government with agations rising on seema : supreme court former justice laxman reddy says vijayawada will not become capital for andhrapradesh

గుబులు పుట్టిస్తున్న జస్టిస్ ప్రకటన

Posted: 09/10/2014 06:20 PM IST
Vijayawada will not be capital of andhrapradesh

విజయవాడ రియల్ వ్యాపారులకు గుండెల్లో గుబులు పుట్టే వార్త ఇది. రియల్ భూంను అమాంతం పెంచేసి లేఅవుట్లు గీసుకున్న వారంతా పేలని అవుట్లలా మారిపోయేలా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రకటన చేశారు. అదే విజయవాడ ఏపీ రాజధాని కాబోదని. మాజి న్యాయమూర్తి చేసిన ప్రకటన వీజీటీఎం వ్యాపారుల్లో భయాందోళనలు కల్గిస్తోంది. చంద్రబాబు చెప్పినంత మాత్రాన..,, అసెంబ్లీ తీర్మానించనగానే ఏది కాదని లక్ష్మణ్ రెడ్డి ప్రకటించారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమ సంఘాలు కడపలో బుధవారం నిర్వహించిన ‘‘కడప ఆకలి కేక’’ సభలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఏపీ అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదని స్పష్టం చేశారు.

లక్ష్మణ్ రెడ్డి ఏమన్నారంటే..

సభలో పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఖరికి వ్యతిరేకంగా ప్రసంగించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన విజయవాడ రాజధాని కాబోదన్నారు. రాజధాని ఎంపిక, ఏర్పాటుకు ప్రత్యేక విధానమంటూ ఉంటుందన్నారు.  ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకోవటానికి అది సొంత ఇళ్లు కాదన్నట్లు పరోక్ష విమర్శలు చేశారు. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ రాజధాని వద్దన్నా కూడా బాబు ఏరి కోరి బెజవాడను పట్టుకోవటం సరికాదన్నారు. క్యాపిటల్ పై కమిటి నివేదికను కేంద్రం పరిశీలిస్తోందని.., త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీమలో నిరుపయోగంగా ఉన్న భూములను వదిలేసి విస్తారంగా పంటలు పండే మాగాణి భూములను రాజధాని కోసం నాశనం చేయటం ఎవరూ అంగీకరించరన్నారు. రాజధానిని రాజకీయ అంశాలతో ముడిపెట్టవద్దన్నారు.

మధ్యలో ఉండాలని ఎవరు చెప్పారు?

ఇక సభలో ప్రసంగించిన మరొక నేత ఇక రాష్ర్టానికి మద్యలో ఉంటుందనే విజయవాడ ఎంపిక చేశామన్న ముఖ్యమంత్రి ప్రకటనను ప్రశ్నించారు. రాజధాని అంటే మధ్యలోనే ఉండాలని ప్రతిపాదిక ఎక్కడుందని ప్రశ్నించారు. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ కూడా భారతదేశం మధ్యలో లేదన్నారు. ఇతర రాష్ర్టాల్లో కూడా రాజధాని నడిబొడ్డున లేనపుడు ఏపీలో మాత్రం నడిబొడ్డున ఉండాల్సిన అవసరమేంటో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం పార్టీ పటుత్వం.., వ్యాపారులు, దళారుల కోసమే విజయవాడను ఎంపిక చేసినట్లు కన్పిస్తోందని భాస్కర్ విమర్శించారు.

ఇక కడప ఆకలి కేక సభలో నేతలు పలు డిమాండ్లు చేశారు. అందులో ప్రధానంగా కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి. హైకోర్టును రాయలసీమలోనే ఉండాలి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా జలాలను కూడ  తిరిగి పంపిణీ చేయాల్సిన అవసరముందన్నారు. నికర జలాలను రాయలసీమకు అందించాలని నేతలు డిమాండ్ చేశారు.

రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేసినప్పటినుంచి రాయలసీమలో రాజధాని ఉద్యమం ఉదృతం అయింది. బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలతో రాయలసీమ అట్టుడుకుతోంది. రాయలసీమ రాజధాని పోరాట సంఘాలతో కలిసి ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. 1956లో ఏపీ ఏర్పాటు కోసం రాజధానిని త్యాగం చేసిన సీమలో రాజధాని ఏర్పాటు చేయకుండా అన్యాయం చేశారని ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు రాజధాని తప్ప మరే ప్యాకేజిలు, స్మార్ట్ సిటీలు వద్దని చెప్తున్నారు. అసలే శివరామకృష్ణన్ కమిటీ సూచనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.., తాజా ఆందోళనలతో మరింత ఇరకాటంలో పడింది. వరుస ఆందోళనలు ప్రభుత్వంతో పాటు పెట్టబడిదారుల్లో గుబులు పుట్టుకుంది. సీమ ఉద్యమాల నేపథ్యంలో విజయవాడ రాజధాని అవుతుందా? కాదా? అనే వివాదం మొదలయింది. రాయలసీమ రాజధాని ఆందోళనలుచివరకు ఏపీ రాజధానిని ఎటు తీసుకెళ్తాయో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  justice laxmareddy  rayalaseema  latest news  

Other Articles