Nri devendar singh jail sentence 2 years for kissing woman in a plane

nri devendar singh, devendar singh jail sentence, devendar singh jail sentenced, man kissed woman plane, airport police, airport security services, united airlines

nri devendar singh jail sentence 2 years for kissing woman in a plane

ఒక్క ముద్దుపెట్టిన పాపానికి రెండేళ్ల జైలుశిక్ష!

Posted: 09/11/2014 11:13 AM IST
Nri devendar singh jail sentence 2 years for kissing woman in a plane

మన భారతదేశంలో నిత్యం అత్యాచారాలు చేస్తున్నప్పటికీ.. నిందితులకు మాత్రం ఎటువంటి శిక్షలు పడటం లేదు. పైగా వాళ్లు బెయిల్ మీద విడుదలయి.. తిరిగి అటువంటి ఘాతుకాలకే పాల్పడిపోతుంటారు. దీంతో మన ఇండియా రానురాను అత్యాచారాలదేశంగా మారుతోంది. కానీ పాశ్చాత్త దేశాల్లో అయితే మాత్రం అత్యాచారాలకు పాల్పడ్డ నిందితులను అప్పటికప్పుడే శిక్ష విధిస్తారు. ఇక అరబ్ దేశాల్లో అయితే క్షణాల్లో మరణశిక్షను అమలు చేసేస్తారు. అందుకే.. ఆయా దేశాల్లో మృగాళ్లు అత్యాచారాలు చేయడానికి భయపడిపోతుంటారు.

ఇదిలావుండగా.. విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళ అందానికి ముగ్ధుడైన అతను.. ఆమె నిద్రస్తున్న సమయంలో ముద్దుపెట్టేశాడు. పైగా అతని వయస్సు 62 సంవత్సరాలు. వృద్ధుడు అయినప్పటికీ మనోడికి ఇంకా కోరికలు తీరినట్టు లేదేమో! అందుకే తనలో వున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లిపోయాడు. ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు గుట్టుచప్పుడు కాకుండా ముద్దుపెట్టేశాడు. అంతటితో ఆగకుండా.. ఆమెపై లైంగికదాడికీ యత్నించాడు. దాంతో వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న సదరు మహిళ భయపడిపోయి... వెంటనే విమానంలో వున్న సిబ్బందిని ఆశ్రయించి, అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో విమానం ఎయిర్ పోర్ట్ చేరగానే అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాల హ్యూస్టన్ నుంచి నెవార్క్ కు వెళ్లున్న యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు ఎన్నారై దేవేందర్ సింగ్ అని.. అతడు ల్యూసియానా ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు ధృవీకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అతడిపై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అతడికి దాదాపు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం వుందని వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nri devendar singh  jail sentence  united airlines  america  

Other Articles