Ec approved to increase seates in telugu states assembly and council

elections, election commission, election commission of india, ceo, voter registration, telangana, andhrapradesh, telangana mla and mp seats, andhrapradesh mla and mp seats, mlc list, number of mlc's in telangana, number of mlcs in andhrapradesh, latest news, ap assembly, telangana assembly, ap legislative council, telangana legislative council

election commission of india approved to inrease seats in telangana and andrapradesh states assembly and council : soon ap and telangana mla and mlc seats would increased a good news for political unemployed

నిరుద్యోగులకు ఎలక్షన్ కమిషన్ గొప్ప శుభవార్త !!

Posted: 09/11/2014 11:16 AM IST
Ec approved to increase seates in telugu states assembly and council

రాజకీయ నిరుద్యోగులకు ఎలక్షన్ కమిషన్ గొప్పశుభవార్త తెలిపింది. ప్రజా ప్రతినిది కావాలన్న తమ కలను నిజం చేసుకునేందుకు నేతలకు ఈసీ తాజా ప్రకటన ఒక వరం లాంటింది. ఇప్పటికే ప్రజా ప్రతినిధులుగా పాతుకుపోయిన నేతల స్థానాలను పొందలేక బాధపడుతున్నవారికి ఇదో తీపికబురు. త్వరలోనే తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ, మండలి సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు స్థానాల పెంపు ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో రెండు రాష్ర్టాల్లో త్వరలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు పెరుగుతాయన్నమాట.

రాష్ర్టవిభజన సందర్బంగా ఏపీ అసెంబ్లీకి 175 అసెంబ్లీ స్థానాలు, 50 ఎమ్మెల్సి స్థానాలు వస్తే.., తెలంగాణకు 119 అసెంబ్లీ, 40 ఎమ్మెల్సి స్థానాలు వచ్చాయి. వాస్తవంగ తెలంగాణకు 37 అసెంబ్లీ స్థానాలు మాత్రమే రావాల్సి ఉండగా చక్రం తిప్పిన ఇక్కడి నేతలు ఎక్కువ సీట్లు వచ్చేలా పావులు కదిపారని తెలిసింది. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందటంతో ఈసీ లెక్కలు, బొక్కలు బయటకు తీసింది. తప్పు జరిగిపోయిందని భావించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు తగ్గించటం అంటే లేని తలనొప్పిని తెచ్చుకున్నట్లే అనుకుని ఎవరికి తగ్గించకుండా రెండు రాష్ర్టాల్లో సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సి స్థానాలతో పాటు అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా తెలుగు రాష్ర్టాల్లో త్వరలో పెంచనుంది.

తాజా పెంపు ప్రకారం చూస్తే.., 175గా ఉన్న ఏపీ అసెంబ్లీ స్థానాలు 225కు పెరిగితే, 50గా ఉన్న ఎమ్మెల్సి స్థానాలు 58 అవుతాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇప్పుడున్న 119 ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 153కి పెంచి, ఎమ్మెల్సి సీట్ల సంఖ్యను 40 నుంచి 50కి పెంచుతున్నారు. త్వరలోనే స్థానాల పెంపుపై రెండు రాష్ర్టాల ప్రభుత్వాలతో మాట్లాడి ఈసి తుది నిర్ణయం తీసుకోంది. ఈ పెంపు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మరొకసారి పునర్ వ్యవస్థీకరించే అవకాశ ముంది. అంతేకాకుండా నియోజకవర్గాల మార్పు.. స్థానాల పరిధిలోని మండలాల మార్పు కూడా జరగనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : election commission  assembly  mlc  latest news  

Other Articles