Kcr aagadu spoof photo gets craze in facebook

kcr, kcr ruling, telangana, telangana government, kcr aagadu spoof, aagadu stills, kcr images, kcr funny, telugu funny images, latest news, facebook, telugu latest updates, trs, mahesh babu fans

kcr fans released aagadu spoof with kcr photo about his 100days ruling : aagadu spoof with kcr photo getting craze in facebook

అదరగొడుతున్న కేసీఆర్ ఆగడు స్పూఫ్

Posted: 09/12/2014 07:52 AM IST
Kcr aagadu spoof photo gets craze in facebook

కేసీఆర్ ఏది చేసినా సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయమూ చర్చకు దారి తీస్తుంది..,  మాట్లాడే ప్రతి మాట ఆసక్తిని రేపుతుంది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు మహేష్ బాబును మించిపోయాడు. కేసీఆర్ కు మహేష్ కు పోలిక ఏమిటంటే.., ఇక్కడున్న ఫొటో చూస్తే అర్ధమవుతోంది. త్వరలో విడుదల కానున్న మహేష్ సినిమా ఆగడు టైటిల్ తో కేసీఆర్ స్టిల్. అయితే ఇది ఆయన స్వయంగా పోజిచ్చిన ఫొటో కాదు. సీఎం సార్ ఫ్యాన్స్ ముచ్చటపడి తయారుచేసుకున్న స్పూఫ్. ఫేస్ బుక్ లో ఈ ఫొటో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అసలే కేసీఆర్.., ఆపై మహేష్ బాబు కాంబినేషన్ అంటే మామూలు మాటలా మరి.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ వంద రోజుల పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.., ఆయన ఫ్యాన్స్ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కఠిన నిర్ణయాలు, అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. ఇకపై ఇదే పంధా కొనసాగుతుందని ఆగడు అనే స్పూఫ్ ఫొటో తయారుచేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఫైటింగ్ కు సిద్ధమవుతున్నట్లు ఉన్న ఈ స్పూఫ్ కేసీఆర్ కు సరిగా సెట్టయింది. ఆగడు.. విజయవంతమైన వందవ రోజు అని పోస్టర్ పై ఉన్న పేర్లను చూసిన ప్రతి ఒక్కరూ అయితే లైక్ లేదంటే కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరయితే ఈ ఫొటోను షేర్ చేసి ముఖపుస్తక స్నేహితులకు చూపించుకుంటున్నారు.

ఇక ఈ ఫొటో ఎంత సంచలనం క్రియేట్ చేస్తోందో.., దాని కింద వచ్చే కామెంట్లు కూడా అలా సంచలనాత్మకంగానే ఉంటున్నాయి. కేసీఆర్ దూకుడు మరింత పెరుగుతుందని ఆయన ఫ్యాన్స్., మద్దతుదారులు అంటుంటే.., నియంత ఆగడాలు ఆగవని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నేతల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిపై స్పూఫ్ తయారు చేయటం చాలాకాలంగా ఉంది. అయితే సంచలనాలకు కేరాఫ్ అయిన కేసీఆర్ ఫొటోను మార్ఫ్ చేయటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వ్యతిరేకంగా పనిచేసే మీడియాను పాతేస్తామన్న కేసీఆర్ ఈ ఫొటోపై ఏమంటారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  aagadu  telangana  latest news  

Other Articles