Is tv9 going to acquire

tv9, tv9 telugu, tv9kannada, tv9 malayalam, tv9 marathi, tv9 bengali, tv9 gujarati, tv9 ban, raviprakash, tv9 for sale, tv9 ban in telangana, latest news, abn ban, ban on media, telugu media news, telugu latest updates

rumors spread over media that telugu news brand tv9 for sale : analysts and media persons saying that tv9 has finished life with new management and soon fills with new management

టీవీ9 వేరేవాళ్లు కొనుక్కోబోతున్నారా..?

Posted: 09/11/2014 06:10 PM IST
Is tv9 going to acquire

తెలుగు న్యూస్ బ్రాండ్ టీవీ9 అమ్మకానికి పెట్టినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం పలువురు బిజినెస్ మెన్లు ఇప్పటికే సంస్థ వాటాలను లేకపోతే మొత్తాన్ని కొనేయటంపై దృష్టిపెట్టారట. సంస్థ కొనుగొలుపై సంబంధిత వ్యక్తులతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు ఎలక్ట్రానికి మీడియాలో సంచలనం క్రియేట్ చేసి న్యూస్ అంటే టీవీ9 అనేస్థాయికి ఎదిగిన సంస్థ ఇప్పుడు అమ్మకానికి వెళ్ళటం వెనక కారణాలేమిటి? ఎక్కడ మొదలైన టీవీ9 చివరకు ఎక్కడకు వెళ్తుందని మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

టీవీ9 ప్రస్థానం ఎలా.. ?

తెలుగులోనే కాకుండా దేశ జర్నలిజం చరిత్రలోనే తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న టీవీ9 పుట్టింది తెలుగుగడ్డపైనే. స్థాపించింది తెలుగు తేజమే. ప్రముఖ బిజినెస్ మెన్ చింతలపాటి శ్రీనివాస రాజు ఈ సంస్థను స్థాపించారు. దీనిలో రవిప్రకాష్ ఇతర వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ ప్రయివేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ నుంచి పుట్టిందీ టీవీ9. 2004 జనవరిలో మొదలైన చానెల్ పదేళ్ళలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. మెరుగైన సమాజం కోసం అని మొదలై సమాజంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. అవినీతే కాదు.. ప్రతి చిన్న తప్పును కూడా జాగ్రత్తగా కెమెరాతో కవర్ చేసి ప్రపంచం ముందు పెట్టింది. మీరే చెప్పండి అంటూ జనాల ముందు మైక్ పెట్టి వారి గళాన్ని నేతలకు విన్పించింది. రోడ్లపై మూత్రం చేసే వారు కూడా పోలిసులకు కాకుండా టీవీ9 లోగును చూసి భయపడేలా చేసింది. ఇది ఓ సినిమాలో మనం చూసే ఉంటాము.

ఎవరీ శ్రీనివాసరాజు

తెలుగు వ్యాపార దిగ్గజంగా పేరొందిన శ్రీనివాసరాజు శ్రీనిరాజుగా అందరికీ సుపరిచితుడు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయనో ఐఐటీ ప్రొఫెషనల్, పలు సంస్థలను స్థాపించిన వ్యవస్థాపకుడు. వ్యాపార రంగంలో తనదైన తెలివితో ఎన్నోసంస్థలను స్థాపించి వాటన్నిటినీ మిగతా పోటి సంస్థలకు ధీటుగా నడుపుతున్న సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్, ఎంటర్ ప్రన్యూర్, ప్రొఫెషనల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. వ్యాపార రంగంలో ఆయన మెలుకువలు గుర్తించిన ప్రముఖ వ్యాపార విద్యా సంస్థలు (బిజినెస్ కోర్సులు అందించే సంస్థలు) రాజుచే క్లాసులు చెప్పిస్తారు. ఆయన ఇచ్చే విద్యార్థులు బిజినేస్ మేనేజ్ మెంట్ సూచనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఎన్నో సంస్థలను స్థాపించిన శ్రీనివాసరాజు టీవీ9 గ్రూపుకు మూలం అయిన ఏబీసీఎల్( అసోసియేటెట్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ ప్రయివేట్ లిమిటెడ్) ను కూడా స్థాపించారు. టీవీ9 తెలుగును మొదలు పెట్టి.. తర్వాత కన్నడ, మలయాళం, గుజరాతి, మరాఠీ, బెంగాలి బాషల్లో ఆయా రాష్ర్టాల్లో చానెల్ ను స్థాపించారు. కంపనీలో మెజారిటీ షేర్లను కలిగి ఉన్నారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఆయన వాటా తగ్గించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సంస్థను అమ్మేయాలనుకుంటున్నారు.

బ్రాండ్ టీవీ9-బ్యాడ్ టీవీ9

24గంటల న్యూస్ చానెళ్ళు మొదలవుతున్న సమయంలో ప్రారంభమైన టీవీ9 బాగా పాపులర్ అయింది. ఒక వార్తను ఎలా చూపిస్తే వీక్షకులు టీవీకి అతుక్కుపోయి ఉంటారో అది టీవీ9కు మాత్రమే బాగా తెలుసు. ఎంతలా అంటే వార్తలు చూడాలంటే టీవీ9 పెట్టేలా... సీరియళ్లు మాని వార్తలు చూసేలా చేసిందీ ఛానెల్. వార్తలు రాసే విధానం నుంచి చదవి విన్పించే వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకమే. అప్పటివరకు ఉన్న న్యూస్ రీడింగ్ విధానానికి స్వస్తి చెప్పి న్యూస్ ప్రజెంటేషన్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ ఛానెలే. అలా వార్తను వార్తలా కాకుండా కొత్తగా అందించి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అలా పొందిన గుర్తింపే ప్రస్తుతం ముప్పైకి పైగా శాటిలైట్ న్యూస్ చానెళ్లు ఉన్నా ఇప్పటికీ తెలుగులో టీవీ9 అదో బ్రాండ్ అనేలా పేరు తెచ్చిపెట్టింది.

చానెల్ లో ప్రసారం అయిన ఎన్నో కధనాలు ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లు ఎందరో అధికారులు, అవినీతి పరుల గుట్టు రట్టు చేశాయి. మీడియా అంటే రాజకీయ నాయకులకు వణుకు పుట్టేలా.., మైకు ముందు మాట్లాడాలంటే ఆలోచించేలా చేసింది. స్టింగ్ఆపరేషన్లు, స్పెషల్ ఫోకస్ ప్రోగ్రాంలతో

మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న టీవీ9 క్రమంగా కడుపునింపుకోవటం వైపు దృష్టిపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. వార్తల నుంచి మెల్లమెల్లగా సినిమా కధనాలు, సినిమా హీరోలు, హీరోయిన్ల గురించి గాసిప్స్, కాస్త అసభ్యమైన వీడియోలను చూపిస్తూ వీక్షకులను ఆకట్టుకుంది. అయితే టీ.ఆర్.పీ. రేసులో తొలిస్థానంలో నిలవటం కోసం ప్రతి ఎత్తూ వేసింది. రెవిన్యూ,. రేటింగుల కోసం క్రమంగా జర్నలిజం విలువలు పక్కనబెట్టి కధనాలు ప్రసారం చేసిందన్న అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రజలకు సమాచారం చేరవేయటం కంటే సంచనలం చేయటం కోసం పాకులాడిందని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఒకే వార్తను పదేపదే చూపిస్తూ దానితోనే పబ్బం గడుపుకుంటుందన్న విమర్శలు కూడ వచ్చాయి. విమర్శకుల నుంచే కాకుండా సామాన్య ప్రజలు కూడా క్రమంగా టీవీ9 అంటే తప్పనిసరిగా చూడాలి అనే స్థాయి నుంచి తప్పనిసరై చూడాలి అనే విధంగా మారిపోయారు.

తెలంగాణ ఉద్యమం

రాజకీయాలనే శాసించిన మీడియాను ప్రజా ఉద్యమం పక్కన పడేసింది. ప్రజల్లో టీవీ9 అంటే కాస్త విసుక్కునే స్వభావం ఎక్కువ అయిన సందర్బంలో.., తెలంగాణ ఉద్యమం మొదలయింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఉద్యమం రోజురోజుకూ ఉదృతం అయింది. ఇటు సంచనాలకు అలవాటు పడ్డ టీవీ 9 యాజమాన్యం ఉద్యమాన్ని కూడా ఏదో సంచలనం కోసం వాడుకోవాలన్నట్లు కొత్త కోణాలు, ప్రశ్నలు తీసుకువచ్చింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ చానెల్ అంటే ఒక ప్రాంతీయ పక్షపాత చానెల్ అనే ముద్ర పడిపోయింది. ఉద్యమం సమయంలోనే టీవీ9పై ఎం.ఎస్.ఓ.లు తొలిసారి నిషేదం విధించారు. అప్పట్లో మూడ్రోజుల పాటు తెలంగాణలో ఈ చానెల్ మూగబోయింది. అయినా సరే వైఖరి మారలేదు. దెబ్బతిన్న పులిలా మరింత రెచ్చిపోయింది. సీమాంధ్ర ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపింది. చివరకు తెలంగాణ ఉద్యమకారులు టీవీ9 సంస్థలు, వాహనాలపై దాడులు చేయటమే కాకుండా రోడ్లపై నిరసనలు వ్యక్తం చేసే స్థాయికి పరిస్థితిని చేజేతులా కొనితెచ్చుకుంది.

రాష్ర్టంలో నిషేధం

ఇక తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత కొద్దిరోజుల పాటు కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన ఎత్తుకుని ప్రచారం చేసిన చానెల్ మళ్ళీ బుల్లెట్ ప్రోగ్రాంతో తనను తానే కాల్చుకుంది. బుల్లెట్ న్యూస్ అనే ప్రోగ్రాంలో తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణస్వీకారంపై వ్యంగ్య కధనం ప్రసారం చేసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. సభను, సభ్యులను అవమానించేస్థాయికి వస్తారా అని నిండు శాసనసభలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యమానికి వెన్నంటి ఉండని చానెల్ కు చుక్కలు చూపాలని సమయం కోసం ఎదురుచూసిన సీఎం.., ఏకంగా మీడియాను నియంత్రించేందుకు తమిళనాడు తరహాలో కేబుల్ చట్టాన్నే తెస్తామన్నారు. ఆ వెంటనే తెలంగాణలో టీవీ9 చానెల్ ప్రసారాలను ఎం.ఎస్.ఓలు నిలిపివేశారు.

చానెల్ ప్రసారాల పునరుద్ధరణ కోసం కోర్టులు స్పందించాయి. కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. చివరకు జర్నలిస్టులు కూడా రోడ్డెక్కి నిత్యం నిరసనలు చేపడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం ఇసుమంత కూడా కదలటం లేదు., ఎం.ఎస్.ఓ.లు బెదరటం లేదు. పైగా మీడియా తెలంగాణలో ఉండాలంటే తెలంగాణకు అనుకూలంగా ఉండాలి.. లేదంటే పది కిలోమీటర్ల లోతున పాతేస్తాం అని స్వయంగా ముఖ్యమంత్రే హెచ్చరించారు. దీన్నిబట్టే ఆయనకు ఈ చానెల్ పై ఉన్న కోపం ఏమిటో అర్ధం చేసకోవచ్చు.

అయితే ఈ ధర్నాలో కేవలం టీవీ9, ఏబీఎన్ సంస్థల ఉద్యోగులు, జర్నలిస్టులు మాత్రమే పాల్గొంటున్నారు. మిగతా చానెళ్ళు కేవలం వివాదాలకు సంబంధించిన వార్తలను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి తప్ప ఉద్యమించటం లేదు. కారణం టీవీ9 లేకపోతే ఆ చానెళ్లు మార్కెట్ పరంగా లాభం పొందవచ్చని. ఇది కూడా టీవీ9 నేర్పిన విద్యే అనుకోవచ్చు. వార్తను మార్కెటింగ్ చేసి చివరికి అదే మార్కెటింగ్ ఉచ్చులో మిగతావాటిని పడేసి తాను ఒంటరై గళం విన్పిస్తోంది. నైతిక స్థైర్యం ఇచ్చేవారున్నారు తప్ప.., వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఇపుడు సంస్థకు కరువయ్యారు.

ఇది చానెల్ ను అమ్మటానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఒక కెరటంలా మెదలై సునామి సృష్టించిన టీవీ9 ఇప్పుడు అమ్మాకానికి ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సంస్థను కొనుగోలు చేసేందుకు మాత్రం పెద్దపెద్ద బిజినెస్ మెన్లు సూటుకేసులు, బ్యాంకు చెక్కులతో ఎదురుచూస్తున్నారనేది నిజం. మెరుగైన సమాజం కోసమని మొదలైన సంస్థ.., ఇప్పుడు అదే సమాజంలో ఇమడలేకపోతుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : tv9  chintalapati srini raju  raviprakash  latest news  

Other Articles