Telangana cm kcr met governor narasimhan and explain about his controversial comments on media

telangana cm kcr, media, tv9 news channel, abn andhrajyothy news channel, national media, kcr comments media, international media, kcr media, kcr media fire

telangana cm kcr met governor narasimhan and explain about his controversial comments on media

నేనలా మాట్లాడలేదు.. మీడియానే వక్రీకరించింది! KCR

Posted: 09/13/2014 09:54 AM IST
Telangana cm kcr met governor narasimhan and explain about his controversial comments on media

ప్రజాకవి కాళోజి శతజయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారంగా మారిపోయింది. ఇప్పటికే జాతీయ మీడియా ఈయననకు మరో హిట్లర్ గా అభివర్ణించేశారు. మీడియా అంటే అంత చులకనగా భావించొద్దు అంటూ నేషనల్ మీడియా ఈయనపై నిప్పులు చెరిగాయి. అంతేకాదు.. ఇప్పుడీ వ్యవహారంగా ఇంటర్నేషనల్ మీడియా చెవిన కూడా పడింది. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్స్(సిపిజె) కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను పాతిపెడతామని, మెడలు విరిచేస్తామని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చెప్పడం చాలా దారుణమని.. ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ సహించరని సీపీజే డిప్యూటీ డైరెక్టర్ రాబర్ట్ మోహోనీ అన్నారు.

ఇదిలావుండగా... కేసీఆర్ మాత్రం తాను మీడియాపై తప్పుగా మాట్లాడలేదని.. కావాలనే మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని అంటున్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన కేసీఆర్.. ఆ సందర్భంలోనే మీడియాపై చేసిన వ్యాఖ్యల గురించి గవర్నర్ దగ్గర ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వుండేవాళ్లు తెలంగాణ సమాజాన్ని గౌరవించాలనే కోణంలోనే ఆరోజు తాను అలా మాట్లాడానని.. మీడియాపై తనకు ఎటువంటి దురద్దేశ్యమూ లేదని ఆయన చెబుతున్నారు. తెలంగాణ గడ్డపై వుండాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రజలను అవమానించకూడదనే దృక్పథంతోనే తాను అలా మాట్లాడినట్టు పేర్కొన్నారు. తానసలు మీడియాపై ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని.. కావాలనే మీడియా ఆ వ్యాఖ్యలను వక్రీకరించిందని గవర్నర్ దగ్గర తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  national media  international media  journalists  rober mohani  

Other Articles