Tdp leaders controversial comments on sania mirza localism and telangana cm kcr

tdp leaders, tdp party communities, sania mirza, telangana cm kcr, kcr sania mirza, kcr latest news, kcr with sania mirza, kcr reward sania mirza, sania mirza hot photo shoot, sania mirza latest photo shoot

tdp leaders controversial comments on sania mirza localism and telangana cm kcr

పాకిస్తానీ సానియామీర్జాకు కేసీఆర్ గాలం! ఎందుకు?

Posted: 09/13/2014 10:35 AM IST
Tdp leaders controversial comments on sania mirza localism and telangana cm kcr

భారతీయ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ నియమించిన నేపథ్యంలోనే అది పెద్ద వివాదాన్నే సృష్టించేసింది. ఒక పాకిస్తానీ మహిళను తెలుగు రాష్ట్రానికి ఎలా అంబాసిడర్ గా నియమిస్తారంటూ అటు రాజకీయ నాయకులతోపాటు నేషనల్ మీడియాలో కూడా ఆరోపణలు రచ్చరచ్చ చేశాయి. అయితే తాను పాకిస్తానీ క్రికెటర్ తో పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక భారతీయురాలినేనంటూ కన్నీటిపర్యంతమైన నేపథ్యంలో ఆ వివాదం ఓ మోస్తరు సద్దుమణిగింది. కానీ ఆంధ్రాలో మాత్రం ఇంకా దీనిపై విమర్శలు వస్తూనే వున్నాయి. తెలుగురాష్ట్రంలోనే అంతర్జాతీయ క్రీడాకారులు వున్నప్పటికీ కేసీఆర్ ఎందుకు సానియా మీర్జానే ఎంపిక చేసుకున్నారంటూ ఇప్పటికీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి.

తాజాగా సానియా మీర్జా స్థానికతపై ఇంకో వివాదం రాజుకుంటోంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు ఈ విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సానియా మీర్జా స్థానికతపై ప్రశ్నలను సంధించారు. అసలు సానియా మీర్జా తెలంగాణ మహిళ కాదని.. పాకిస్తానీ మహిళేననంటూ నొక్కొనొక్కి వక్కాణిస్తున్నారు టీడీపీ నేతలు! పాకిస్తానీ దేశస్థుడిని వివాహం చేసుకున్ని సానియా.. ఆ దేశపు జాతీయురాలే అవుతుందని వారు పేర్కొంటున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే కేసీఆర్ ప్రతిఒక్కసారి సానియాను ప్రోత్సహిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. అందువల్లే ఆయన నెలన్నర్ర వ్యవధిలోనే మరో కోటి రూపాయల నజరానాను సానియా ముట్టజెప్పినట్లు వారు వెల్లడిస్తున్నారు. మరి ఈ వివాదంపై సానియా ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  kcr  tdp party  sania mirza localism  telangana state  brand ambassador  

Other Articles