Karthik gowda statements on mythriya complaints

karthik gowda, actress mythriya, karthika gowda mythriya, mythriya rape case, mythriya comments, mythriya hot photos, bangalore rt police station, police investigations

karthik gowda statements on mythriya complaints : finally karthik gowda gave explanation on his relationship with actress mythriya in police investigation

నటి మైత్రేయిని అత్యాచారం చేయలేదు! : కార్తీక్ గౌడ

Posted: 09/13/2014 11:49 AM IST
Karthik gowda statements on mythriya complaints

ఇటీవలే కన్నడ వర్ధమాన నటి మైత్రేయి కేంద్రరైల్వేమంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, వీలున్నప్పుడల్లా అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! (అదికూడా అతని నిశ్చితార్థం రోజే ఈమె ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనాన్నే రేపింది.) ఈమేరకు ఆమె బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే ఇంతలోనే కార్తీక్ గౌడ్ కనిపించకుండాపోయాడు. తొలుత ఆమెను వైద్య పరీక్షలకు పంపించిన అనంతరం కార్తీక్ గౌడ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టేశారు. అతను ఎక్కడున్నాడన్న సమాచారం తెలియని నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాల్సిందిగా అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అతని నుంచి సమాధానం రాలేదు కానీ.. గురువారంనాడు హఠాత్తుగా కనిపించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో చమత్కరించాడు.

గురువారం ఉదయం ఆరున్నరకే ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ కు కార్తీక్ విచ్చేసి అధికారులందరినీ షాక్ కు గురిచేశాడు. తొలుత అతనిని వైద్య పరీక్షలకసం అంబేద్కర్ వైద్య కళాశాలకు తీసుకెళ్లిన అనంతరం.. అక్కడి నుంచి నేరుగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు పరిచారు. మైత్రేయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారి కార్తీక్ కు దాదాపు 80 నుంచి 100 ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నోత్తరాల నేపథ్యంలో తనకి, మైత్రేయికి మధ్య వున్న సంబంధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

మైత్రేయిపై తాను అత్యాచారానికి పాల్పడలేదని.. అసలు తనని పెళ్లి కూడా చేసుకోలేదని పేర్కొన్నాడు. తన ఫ్రెండ్స్ ద్వారా ఆమె పరిచయమైందని.. అప్పుడప్పుడు పార్టీల్లో కలుసుకున్న సందర్భాలు మాత్రమే వున్నాయని వివరణ ఇచ్చినట్లు సమాచారం! ఆ పరిచయమే కాస్త ఫ్రెండ్ షిప్ గా మారిందే తప్ప... తమ మధ్య లైంగిక సంబంధం మాత్రం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్ గా ఫోన్ లో మాట్లాడిన విషయాలను రికార్డు చేసి మైత్రేయి తనపై కట్టుకథలు అల్లుతోందని అతను ఆరోపించాడు. అలాగే మంగుళూరులో తామిద్దరూ పెళ్లి చేసుకున్నామన్న మైత్రేయి ఆరోపణలను కార్తీక్ తోసిపుచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles