బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయింది. ఉత్సవాన్ని ఇప్పటికే రాష్ర్ట పండగగా గుర్తించిన ప్రభుత్వం.., 9రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించింది. పండగ కోసం ప్రత్యేకంగా పది కోట్ల రూపాయలను కేటాయస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లకు బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు కేటాయించింది. అదనంగా అవసరం అనుకున్నా డబ్బులు ఇస్తామని తెలిపింది.
బతుకమ్మ పండగ సందర్బంగా అమ్మవారిని నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు ఇతర ప్రదేశాలను అలంకరించటంతో పాటు, శుభ్రత, లైటింగ్, ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం గ్రామస్థాయి అధికారులతో కూడా చర్చలు జరపాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రతి పట్టణం, నగరాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మ సంబరాలపై బెలూన్లు ఏర్పాటు చేయమని చెప్పింది. అంతేకాకుండా ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభ చూపే మహిళలకు బహుమతులు అందించాలని ప్రత్యేకంగా ఆదేశించింది. ప్రతి జిల్లా నుంచి యాబై మంది వరకు మహిళలను ఎంపిక చేసి వారిని ట్యాంక్ బండ్ పై నిర్వహించే సద్దుల బతుకమ్మకు పంపించాలని చెప్పింది.
సోనియా, సుష్మా, మీరా రావాలి
ఇక తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళాప్రముఖులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు కోసం బిల్లు పెట్టిన సోనియా గాంధీతో పాటు రాష్ర్ట ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ చూపిన సుష్మా స్వరాజ్.. పార్లమెంటులో బిల్లు ఆమోదంకు కృషి చేసిన నాటి స్పీకర్ మీరా కుమార్ ను ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానాలు పంపింది. వీరితో పాటు విభజనకు జాతీయస్థాయిలో తొలిసారి మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more