Murder case on pakisthan prime minister

murder case, police, pakisthan, pakisthan news, pakisthan army, pakisthan political parties, pakisthan map, pakisthan prime minister, latest news, nawaz sharif, imran khan, pti, pat, world news

police filed murder case on pakisthan prime minister for the cause of protesters death in agigations : pat leader filed pitition on court to book pak pm nawaz sharif with murder case

పాక్ ప్రధానిపై మర్డర్ కేసు నమోదు

Posted: 09/17/2014 03:05 PM IST
Murder case on pakisthan prime minister

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం దిగిపోవలని ఇన్ని రోజులూ.., నిరసనకారులు ఆందోళనలకు దిగగా.., వాటి తాలూకు మచ్చలు షరీఫ్ ను వెంటాడుతున్నాయి. నవాజ్ షరీఫ్, ఆయన మంత్రి వర్గ సహచరులపై హత్య కేసు నమోదైంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పలువురు నిరసనకారుల మృతి చెందారు. వీరు చనిపోవటానికి ప్రధాని, కేబినెట్ కారణమని పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ (పీఏటీ) సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి.. షరీఫ్ పై హత్య అభియోగాలతో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో మంగళవారం రాత్రి ప్రధానిపై ఇస్లామాబాద్ పోలిసులు కేసు నమోదు చేశారు.

పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం సెక్షన్ 7ల ప్రకారం అభియోగాలు నమోదు చేశామని పోలిసులు తెలిపారు. గత నెలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసులో దాదాపు పది మంది వరకు నిరసనకారులు చనిపోయారు. పోలిసుల లాఠీచార్జ్, తొక్కిసలాట ఇతర కారణాల వల్ల వీరంతా చనిపోయారు. ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించటం వల్లే వీరు చనిపోయారని విమర్శలు వచ్చాయి. అటు నవాజ్ షరీఫ్ పై ఇది రెండో హత్య కేసు. జూన్ లో 14 మంది పీఏటీ కార్యకర్తల మృతికి కారణమయ్యారంటూ తొలి కేసు నమోదైంది. తాజాగా ఆగస్టు 30న జరిగిన ఆందోళనల సందర్భంగా ముగ్గురు చనిపోగా, 500 మంది దాకా గాయపడ్డ ఘటనపై రెండవ కేసు నమోదైంది.

పాకిస్థాన్ లో ఏర్పడిన నవాజ్ షరీఫ్  ప్రజలకు చేసిందేమి లేదని పీటీఐ పార్టీ నేత, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వం గద్దె దిగాలంటూ గత నెలలో ఆజాదీ మార్చ్ లు నిర్వహించారు. వేలాది మంది మద్దతుదారులు, అనుచరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇస్లామాబాద్ పరిసరాలన్నిటినీ పోలిసులు దిగ్బందించారు. పలువురు పార్లమెంటు వైపు దూసుకెళ్లగా.., వీరిని కట్టడి చేసేందుకు లాఠీచార్జ్ జరిపారు. ఈ సందర్బంగా జరిగిన గొడవల్లో నిరసనకారులు మృత్యువాతపడ్డారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan  nawaz sharif  protests  latest news  

Other Articles