Yasin malik hijacks rescue boat in jammu kashmir

yasin malik, yasin malik comments, jklf yasin malik, jklf, jammu kashmir, kashmir, yasin malik biography, yasin malik wife, yasin malik wiki, jammu kashmir floods, kashmir floods, flood resilef, army rescue operations, jammu kashmir rescue operations, latest news, boats, rescue boats, life boats, food, jammu kashmir relief, hijack, flight hijack, boat hijack

kashmir seperatist yasin malik cruelty came into action again he stops rescue boats and relief operations in jammu kashmir : whole country scolds and feels shamed with yasin malik cruel activity

జమ్మూలో రెస్క్యూ బోట్ హైజాక్ చేసిన యాసిన్

Posted: 09/17/2014 01:47 PM IST
Yasin malik hijacks rescue boat in jammu kashmir

వేర్పాటువాదులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో జమ్మూ కాశ్మీరీ యాసిన్ మాలిక్ ను చూస్తే తెలుస్తుంది. భీకర వరదలతో నిండా మునిగిన కాశ్మీరీలను తలుచుకుని యావత్ దేశం చలించిపోతుంటే.., యాసిన్ మాత్రం తన వికృత చేష్టలతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు రెండు వారాలుగా తిండి తిప్పలు మాని కష్టపడుతున్నాయి. దేశ ప్రజలను రక్షించేదుకు ప్రకృతి దాడిపై పోరాడుతున్నాయి. అయితే మాలిక్ మాత్రం మీ సాయం అక్కర్లేదు అని తెగేసి చెప్తున్నాడు. అంతేకాదు సాయం చేయడానికి వచ్చిన బోట్ ను కూడా హైజాక్ చేసి పాశవికత్వం అంటే ఏమిటో చూపించాడు. కాశ్మీర్ లోయలోని ఓ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతో ఓ రెస్క్యూ బోట్ వెళ్ళగా వారిని మాలిక్ తన అనుచరులతో అడ్డుకున్నారు. తమకెవరూ సాయం చేయవద్దనీ.., ఇలాగే చావనివ్వండి అని క్రూరంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సాక్ష్యం చెప్తోంది.


సహాయక చర్యలకు అడ్డుపడటంతో పాటు.., బోటులొని ఆహార పధార్ధాలను లాగేసుకుని ఎవరికి ఇవ్వకూడదని చెప్పాడు. అటు బోటులో ఎక్కిన పలువురు మహిళలు, అనారోగ్యంతో ఉన్నావారిని బలవంతంగా దించేశాడు. సురక్షిత ప్రాంతానికి వెళ్ళనివ్వాలని బాధితులు, సహాయక సిబ్బంది ఎంత చెప్పినా విన్పించుకోలేదు. సిబ్బందిని బోటు వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరించగా వారు వినకపోవటంతో... బోటును హైజాక్ చేసి తీసుకెళ్లారని వీడియో ద్వారా తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో పాటు, జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. యాసిన్ చర్యలపై జాతీయ మీడియా మండిపడింది. పార్టీలకు అతీతంగా నేతలు యాసిన్ ను అరెస్టు చేసి లోపల పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yasin malik  boat hijack  jammu kashmir floods  rescue and relief  

Other Articles