తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా విమోచన దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహించకపోవడంతో.. చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యతను తెలంగాణ బావితరాలకు తెలియజెప్పుందుక పాఠ్యాంశాలలో చేర్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటు నిజాం నవాబు వాస్తవ చరిత్రను కూడా పాఠ్యాంశంగా చేర్చాలని మరో డిమాండ్ వినిపిస్తోంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సాహిత్యం, ఇత్తివృత్తాలను మరుగున పడ్డాయని వాటిని ఇన్నాళ్లు వాదించిన తెలంగాణ వాదులు.. ఇప్పుడు ఈ డిమాండ్లను తెరపైకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ సంస్థాన చివరి ప్రభువులుగా వున్న ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేస్తూ.. ఆయనను దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో నిజాం నవాబు అసలు చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, వాస్తవ పరిస్థితిని బావితరాలకు తెలియజేయాల్సిన అవసరం తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై వుందన్న వాదనలు వినబడుతున్నాయి. నిజాం నవాబు వాస్తవ చరి త్రను పాఠ్యాంశంగా చేర్చాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుందర్‌లాల్ కమిటీ రిపోర్టు ఆధారంగా సీనియర్ జర్నలిస్టు ఎం.ఎ మజీద్ ఉర్దూలో అనువదించిన ‘నా శవ పేటికపై ఉత్సవాలా..!’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల కోసం నిజాం నవాబుల వాస్తవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
నిజాం నవాబు సెక్యులర్‌వాదని, మిగతా ప్రాంతాల కంటే దక్కన్ హైదరాబాద్‌లోనే మతసామరస్యం వెల్లివిరిసిందని అన్నారు. ఈ విషయాలను పండిత్ సుందర్‌లాల్ కమిటీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. హిందూ దేవాలయాల నిర్మాణాలకు, నిర్వహణకు ప్రతి ఏటా నిధులు కూడా అందించిన ఘనత నిజాం నవాబులకే దక్కుతుందన్నారు. హిందూ సమాజంలో దేవదాసీ వ్యవస్థను నిజాం నవాబులే అంతమొందించారని అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు నాటి హిందూ మహాసభ.. నిజాం నవాబుకు కృతజ్ఞతలు తెలిపిందని గుర్తు చేశారు.
ఇదే సమయంలో నిజాం నవాడు పాలన దాష్టికాలు, హింస, అకృత్యాలు, అత్యాచారలతోనే నిండిందన్న అరోపణలు వినబడుతున్నాయి. నిజాం సర్కార్ నిరంకుశ పాలనతోనే తెలంగాణలో సాయుధ పోరాటం ఘట్టానికి అంకురార్పణ జరిగిందని చెప్పాయి. చాకలి ఐలమ్మ, షోలబుల్లా ఖాన్ వంటి వారు నిజాం పాలనకు, పాలనలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేస్తున్నారు కామ్రేడ్లు. భారతదేశానికి స్వాత్రంత్యం వచ్చినా.. తన సంస్థానాన్ని వీలినం చేయడం ఇష్టంలేని నిజాం.. తన సంస్థానాన్ని పాకిస్థాన్ తో అనుసంధానం చేయాలని కోరిన విషయాలను కూడా గుర్తుచేస్తున్నారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్థార్ వల్లభ బాయ్ పటేల్ సాహసోపేత పోలీసు చర్య నిర్ణయంతోనే నిజాం నవాబు లొంగిపోయారన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు కామ్రేడ్లు.
బావితరాలకు సెప్టెంబర్ 17 అంశ ప్రాముఖ్యతను తెలిపాలని అందుకని ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించాలని సూచించారు. బీజేపీ, ఎంఐఎం దీనికి మతం రంగు పులుముతున్నాయని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగకూడదని సురవరం అన్నారు.
అయితే ఇరు వర్గాల మద్య జరగుతున్న వాదనలు తీవ్ర రూపం దాల్చితే.. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఉనికికే ప్రమాదం పోంచి వుందన్న నిజాన్ని ప్రభుత్వం గ్రహిస్తోంది. దీనగాధులు, ప్రభువుల కీర్తనలు తెరపైకి వస్తే.. ఆ చరిత్రనే భావి తరాలకు అందుతుందని, ఇక తమ ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలు రానురాను మర్చిపోతారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలకు స్వస్తి పలికి కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పాఠ్యాంశంగా చర్చాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం వుందని సమాచారం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more