Chandrababunaidu grading to ap ministers

andhrapradesh, andhrapradesh cabinet, andhrapradesh ministers, andhrapradesh ministers gradings, devineni uma maheshwar rao, yanamala ramakrishnudu, ap minister, ap mla mp list, telangana, chandrababu naidu, nara lokesh, chandrababu family, latest news, telugu news updates

andhrapradesh cm chandrababu naidu given gradings to cabinet ministers of state : in babu's grading minister devineni uma got first place kamineni srinivas, achennaidu next places but finance minister yanamala and k e krishnamurthy didn't get any grade

ఏపీ కేబినెట్ తొలి రిజల్ట్ విడుదల

Posted: 09/18/2014 10:02 AM IST
Chandrababunaidu grading to ap ministers

మామూలుగా అయితే మనకు స్కూళ్ళలో చివరికి కాలేజిల్లో కూడా ర్యాంకులు, గ్రేడింగులు ఇస్తుంటారు. అయితే చంద్రబాబు ఒక కొత్త విధానం తీసుకువచ్చారు. అదే మంత్రులకు గ్రేడింగ్. తీసుకురావటమే కాదు తొలి దఫా గ్రేడింగులు కూడా ఇచ్చేశారు.ప్రభుత్వంలో గ్రేడులు ఏమిటి అని కొందరు అనుకుంటున్నా.., పరిపాలన వేగంగా జరగాలంటే ఇలాంటివి తప్పవు అని అంటున్నారు ప్రభుత్వ పెద్ద. ఇక చంద్రబాబు తొలి జాబితాలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా మహేశ్వర రావు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, టిడిపికి చెందిన అచ్చెన్నాయుడు రెండవ, మూడవ ర్యాంకులు సాధించారు. వీరి తర్వాత వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పరిటాల సునీత, రాఘవరావు, పల్లె రఘునాధ్ ఉన్నారు. అటు మిగతా మంత్రులు రావెల కిశోర్ బాబు, నారాయణ వరుసగా తర్వాత ర్యాంకులు దక్కించుకున్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే కీలకమైన ఇద్దరు మంత్రులు కనీసం చివరి స్థానాల్లో కూడా చోటు దక్కించుకోకుండా ఫెయిల్ అయ్యారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి అయిన కే.ఈ. కృష్ణమూర్తి కాగా మరొకరు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరికి బాబు గ్రేడింగ్ ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ పరంగా వీరు ఏమి పని చేయలేదని స్పష్టం అవుతంది. సీనియర్ నేతలుగా.., కీలక మంత్రి బాద్యతలు నిర్వర్తిస్తున్న వారి సంగతి ఇలా ఉంటే కొత్తవారు మాత్రం దూసుకెళ్తున్నట్లు బాబు ర్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఇలాంటివి ఉంటే మంత్రులు ప్రజల కోసం కాకపోయినా.., ప్రకటించే ర్యాంకుల కోసమైనా పని చేస్తారు కాబోలు.

అయితే పార్టీ టికెట్లు, కేబినెట్ సీట్లను కులాల వారీగా ఇచ్చినట్లు కాకుండా., పనితీరు, అసెంబ్లీలో వ్యవహార శైలి ఆధారంగా ఈ గ్రేడులు ఇచ్చారు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు పర్యవేక్షణ చే్స్తే, పార్టీ పరంగా చినబాబు నారా లోకేష్ పరిశీలించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విధానం, కార్యకర్తలు నేతలతో మంత్రులు మెలుగుతున్న తీరుపై లోకేష్ స్వయంగా వివరాలు సేకరించి బాబు చిట్టాకు అందించారు. రెండింటిని బేరిజు వేసి కల్లేసి మెల్లేసి, చివరకు ఈ ర్యాంకులను ప్రకటించారు. బాబుగారా మజాకానా !!.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap ministers  devineni uma  chandrababu naidu  gradings  

Other Articles