Modi s nda regime is like upa 3

Telangana, AP, Odisha, modi, NDA, UPA, jagan, central government, Maoist Party, Responce, Prices, Essential goods

moist party alleges that Modi's NDA regime is like UPA-3

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. యూపీఏ-3ని తలపిస్తోంది

Posted: 09/18/2014 10:16 AM IST
Modi s nda regime is like upa 3

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పోకడలు గమనిస్తే.. యూపీఏ-3 ప్రభుత్వాన్ని తలపిస్తుందని  సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ధ్వజమెత్తారు. గత యూపీఏ ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల వంటి కారణాలతో.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బీజేపి ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ను కాదని ఇటీవల జరిగిన ఎన్నికలలో కేంద్రంలో బీజేపి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలలో అధికారంలోకి వచ్చిన మోడీ, చంద్రబాబు, చంద్రశేఖరరావు, నవీన్‌పట్నాయక్‌ల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని జగన్ వెల్లడించారు.

మునుపటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలపై జరుగుతున్న పోరాటాలపై అణచివేత కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాలకు ప్రజలే బుద్దిచెబుతారన్నారు. గుజరాత్ వికాస్ నమూనా ముందుపెట్టి మోడీ అధికారంలోకి వచ్చారని, అయితే దీని పోకడను బట్టి చూస్తే ఇది కూడా యూపీఏ-3 మాదిరిగానే అనిపిస్తుందని విమర్శించారు.

నక్సల్ ఎజెండా అమలు చేస్తామని, దళితుడిని సీఎంని చేస్తానని, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, రుణమాఫీ అమలు వంటి అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు దాటినా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంతో తమ బతుకులు మారుతాయని గంపెడాశలు పెట్టుకున్న పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. తుపాకులు పక్కనపెడితే మావోయిస్టులతో చర్చలకు సిద్దమేనని హోంమంత్రి నాయిని చెబుతుంటే మరోపక్క పోలీసుశాఖ ఆధునికీకరణ పేరుతో వాహనాల కోనుగోలు, అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలతో గాలింపులు నిర్వహిస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్ ఇటీవల మీడియాపై చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ సైతం ఖండిస్తోందని జగన్ వెల్లడించారు. తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిషేధం విషయంలో ఎంఎస్‌ఓల ప్రతి స్పందన న్యాయనని.. అయితే.. దాని ప్రయోజనం పాలకుల నియంతృత్వానికి దారి తీయొద్దని అభిప్రాయపడ్డారు. మీడియా స్వేచ్ఛ అంటే పాలకులు, మీడియా యాజమాన్యల స్వేచ్ఛ కాదన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  AP  Odisha  modi  NDA  UPA  jagan  central government  Maoist Party  Responce  Prices  Essential goods  

Other Articles