Ap government to distribute clothes to poor during festivals

andhrapradesh, andhrapradesh government, andhrapradesh capital, chandrababu naidu, ap cabinet, ap mla list, ap mp list, government schemes, essential commodities, dasara, dushera, pongal, sankranthi, telugu festivals, poor, poor people, poverty, poverty in india, tdp, telugudesam party, ravela kishore babu, social welfare minister, latest news, clothes, festival offers, bonanza

ap minister ravela kishore babu suggested cm chandrababu naidu to give clothes and essential commodities to poor during festivals : poor people of andhrapradesh going to get clothes and essential commodities for their festivals its proposal may accept

పేదలకు ఏపీ ప్రభుత్వ పండగ బోనాంజా..?

Posted: 09/19/2014 06:42 PM IST
Ap government to distribute clothes to poor during festivals

రాష్ర్టంలోని పేదలకు ఏపీ ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. పండగ పూట కూడా సంతోషంగా ఉండలేని పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త పధకం తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి పండగకు పేదలకు కొత్త బట్టలు, పండగకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు పంపిణి చేయాలని భావిస్తోంది. ఏపీ సాంఘీక సంక్షేమ మంత్రి రావెల కిశోర్ బాబు ఈ పధకానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మహత్తర పంపిణీ పధకం  ఆచరణలోకి వచ్చే అవకాశముంది.

పధకం ముఖ్య ఉద్దేశ్యం

రాష్ర్టంలో ధనికుల కంటే పేదలు ఎక్కువ ఉన్నారు. వారంతా మామూలు రోజుల్లో పూట గడవటానికి నానాకష్టాలు పడతారు. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలు ఏపీలో ఎన్నో ఉన్నాయి. వారు చేసిన కష్టం రోజు అవసరాలకే సరిపోదు.. ఇక పండగలు వస్తే అదనపు ఖర్చులు భారమే అవుతాయి. పిండివంటలు చేసుకుని.., కొత్తబట్టలు తెచ్చుకోవాలని ఉన్నా చేయలేని పేదరికం వారిని వెక్కిరిస్తుంది. దీంతో పండగ పూట అయినా పేదల కుటుంబాల్లో ఆనందం నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే ప్రధాన పండగలు అయిన దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో కొత్త బట్టలతో పాటు.., నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇలా చేయటం వల్ల పేద కుటుంబాల్లో పండగ రోజయినా ఆనందం వెల్లివిరుస్తుందని భావిస్తోంది.

ఉచితమా.. డబ్బులా..?

ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం.. పండగ ఆఫర్ పొందే పేదలను ఎంపిక చేసేందుకు.., రేషన్ లబ్దిదారులను ప్రమాణికంగా తీసుకుంటారని తెలుస్తోంది. రేషన్ కార్డుల్లో తెల్ల కార్డుతో పాటు, అంత్యోదయ ఇతర రకాల కార్డులకు ప్రభుత్వ సబ్సిడీ కాస్త ఎక్కువ అందుతుంది. ఇక మరీ లోతుగా ఆలోచిస్తే తెల్లరేషన్ కార్డులతో పోలిస్తే బీపీఎల్ కార్డుల వారికి లబ్ది ఎక్కువగా ఉంటుంది. మరి కొత్తగా ప్రారంభించే పధకంలో పేదలు అంటే.. తెల్ల రేషన్ కార్డువారిని కూడా చేరుస్తారా.. లేక వారికంటే తక్కువ ఆదాయం ఉన్న వర్గాలను తీసుకుంటారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. అదేవిధంగా, ఈ పధకం ఉచితంగా అమలు చేస్తారా.., లేక నామమాత్రపు డబ్బులు తీసుకుంటారా? అనేది కూడా పూర్తి సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం పండగల సమయంలో రేషన్ సరుకులు అప్పుడప్పుడూ అదనంగా ఇస్తున్నారు. అయితే వాటికి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పంపిణీ ఉచితంగానా లేక.. డబ్బులు తీసుకునా విషయం స్పష్టత రావాల్సి ఉంది.

అదనపు అప్పు.. అమలెప్పుడు

విభజన ప్రక్రియలో జరిగిన ఆస్తి అప్పుల పంపకాలతో ఏపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది. ప్రస్తుతం సంక్షేమ పధకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేంత బడ్జెట్ ఏపీ సర్కారుకు లేదనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో ఇప్పటికే ఉన్న బారాలకు తోడు.., అదనంగా బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం అనేది అదనపు భారమే అవుతుంది. ఇక బట్టలు ఉచితంగా పంపిణీ చేస్తే మాత్రం భారం మరింత ఎక్కువ అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. సంక్షేమ పధకం ఉద్దేశ్యం మంచిగా ఉన్నప్పటికీ.., ప్రస్తుత సమయంలో ఇది అవసరమా? అని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

అటు పంపిణీ పధకం ఎప్పట్నుంచి అమలు చేస్తారనేది ఇంకా ప్రభుత్వం తెలియపర్చటం లేదు. కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉన్నందున.., కేబినెట్ లో చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత అమలు చేస్తారని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ దసరాకే పధకం అమలు కావచ్చు. లేకపోతే

జయ పధకం చూసాకా..?

ఈ మధ్య ఏపీ ప్రభుత్వం చాలా పధకాలను తీసుకువచ్చింది. అందులో కొన్ని తమిళనాడు పధకాలను పోలి ఉన్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  festivals  latest news  chandrababu naidu  

Other Articles