Warning calls to shilpashetty and her husband raj kundra to arrange 3 crores money from ravi pujari

shilpa shetty latest news, shilpa shetty raj kundra, raj kundra latest news, shilpa shetty hot photos, shilpa shetty hot photo shoot, shilpa shetty raj kundra warning calls, mumbai police, shah rukh khan, sonu sood, boman irani

warning calls to shilpashetty and her husband raj kundra to arrange 3 crores money from ravi pujari

3 కోట్లుంటే ఓకే.. లేదా శిల్పాశెట్టి దంపతులు చనిపోతారట!

Posted: 09/22/2014 09:11 PM IST
Warning calls to shilpashetty and her husband raj kundra to arrange 3 crores money from ravi pujari

(Image source from: warning calls to shilpashetty and her husband raj kundra to arrange 3 crores money from ravi pujari)

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నప్పటికీ.. వారి దగ్గర 3 కోట్లు లేకపోతే వాళ్లు చనిపోబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒక ఐపీఎల్ టీమ్ కు ఓనర్, ఇండియాతోపాటు ఇతర దేశాల్లో కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న ఈ దంపతుల దగ్గర డబ్బులకు కొదవే లేదు. గతంలో వీళ్ల అప్పుల్లో మునిగిపోయారనే వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట ఖండించి తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అయితే ప్రస్తుతం 3 కోట్ల కోసం వీళ్లు నానాతంటాలు పడుతున్నారని.. అవి లేకపోతే తమ ప్రాణాలకే హాని కలుగుతుందని స్వయంగా పేర్కొంటున్నారు. అయితే వీళ్ల దగ్గర డబ్బులు లేక వీళ్లిలా ప్రవర్తించడం లేదులెండి.. వీళ్లకూ ఇతర తారలకు వచ్చినట్లే అనుకోకుండా ఒక బెదిరింపు కాల్ వచ్చింది.

గతకొన్నిరోజుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సోనూసూద్, బొమన్ ఇరానీలాంటి టాప్ సెలబ్రిటీలకు రవి పూజారి నుంచి బెదిరింపు పోన్ కాల్స్ వచ్చి, అప్పుడే డెడ్ అయిన విషయం అందరికీ తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఈ బెదిరింపు కాల్స్ జాబితాలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు కూడా చేరిపోయారు. ఎవరో గుర్తుతెలియని ఆగంతకుడు తాను రవిపూజారినని.. వెంటనే మూడుకోట్ల రూపాయల సిద్ధం చేయాలని శిల్పా దంపతులకు ఫోన్ చేశాడు. ఒకవేళ ఆ డబ్బులను అరేంజ్ చేయకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ అతడు బెదిరించాడట! దీంతో అప్రమత్తమైన దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారికొచ్చిన ఫోన్ కాల్ పై దర్యాప్తు చేపట్టారు.

అయితే ఎడతెరిపి లేకుండా ఒకరి తర్వాత మరొక సెలబ్రిటీలకు వరుసగా ఇలా బెదిరింపు కాల్స్ రావడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అండర్ వల్డ్ డాన్ రవిపూజారియే ఇలా చేస్తుంటే.. అతడు వాళ్లపై యాక్షన్ తీసుకోకుండా ఎందుకు వదిలేస్తున్నాడనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు! లేదా ఎవరో సన్నిహితులే ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారని వారు అపోహ వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కాల్స్ ఇతర సెలబ్రిటీలకు కూడా రావచ్చునని.. అందుకే ఆ కోణంలో పోలీసులు ముందుగానే ఫోన్లను ట్యాపింగ్ లో పెట్టే ఆలోచనల్లో వున్నారని సమాచారాలు అందుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpa shetty  raj kundra  shah rukh khan  ravi pujari  sonu sood  

Other Articles