మామ్ అంటే అమ్మ.. మనల్ని అమ్మ ఎప్పుడూ నిరాశపరచదు... అమ్మలాగే మామ్ విజయతీరాలకు చేర్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతమైన సందర్భంగా ఇస్రో కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇవాళ చరిత్ర లిఖించామని అభివర్ణించారు. అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని భారతీయ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారని ఇస్రో శాస్త్రజ్క్షులపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని మోడీ అన్నారు. ఇతరులు అసాధ్యమని, ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన కార్యాన్ని మనం సుసాధ్యం చేసి చూపించామని మోడీ అన్నారు.
ఇస్రోను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని అన్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం భారత శాస్త్రవేత్తలకే దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం ఒక చారిత్రత్మక ఘటం అని ఉద్వేగంతో ప్రసంగించారు. తొలి ప్రయత్నంలోనే మనం విజయం సాధించామని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కన్నా మామ్ ప్రయోగం బడ్జెట్ తక్కువని మోడీ వ్యాఖ్యానించారు. అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచిందన్నారు. మన శాస్త్రవేత్తల కోఠర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలు రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
అంతకుముందు మంగళ్ యాన్ విజయాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్రమంత్రి సదానందగౌడ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు ఇస్రోకు చెందిన టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్టాక్)కు చేరుకున్నారు. భూమిపై సూర్యోదమయ్యే వేళకు ... దాదాపు ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహానికి మామ్ శుభోదయం పలుకుతుంది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రధాని వీక్షించారు. ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను పరిశీలించారు. ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి ప్రధాని మోడీ 'మామ్'ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను పరిశీలించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more