Woman gives birth to five babies in manipur

Manipur, Gita Devi, Five babies, Babies, Regional Institute of Medical Sciences, RIMS, Imphal

Woman gives birth to five babies in Manipur

ఒకే కాన్పులో ఐదుగురి శిశువులకు జననం

Posted: 09/24/2014 11:16 AM IST
Woman gives birth to five babies in manipur

ఈశాన్య రాష్టరంలో లో మరో అరుదైన ఘట్టం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో తొలిసారిగా ఓ తల్లి ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. మణిఫూర్ లోని ఇంఫాల్ రిమ్స్ అస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఇంఫాల్ పట్టణానికి కొద్ది దూరంలో వున్న తాంగ సామ్ కోన్ గ్రామానికి చెందిన శాంతా సింగ్ తన  34 ఏళ్ల భార్య గీతా దేవికి నోప్పులు వస్తున్నాయని రెండు రోజుల ముందు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు ప్రసవం చేసిన వైద్యలు విస్మయానికి గురయ్యారు. కేవలం గంట 10 నిమిషాల (70 నిమిషాల) వ్యవధిలోనే ఐదురుగు బిడ్డలకు ఆ తల్లి జన్మనిచ్చింది.

వీరిలో నలుగురు అడ శిశువులు కాగా, ఒక్క మగ శిశువు వుందని వైద్యులు తెలిపారు. వీరిలో ఒక పాప కళ్లు కూడా తెరవకుండానే పుట్టిన మరుక్షణమే మరణించిందని వైద్యలు తెలిపారు. మిగిలిన వారిలో ఇద్దరు శిశువలు బలహీనంగా వుండటంతో వారిని అత్యవసర వైద్య విభాగంలో వుంచి  వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన ఇద్దరు శిశువులతో పాటు తల్లి సురక్షితంగా వున్నారని, కోలుకుంటున్నారని వైద్యలు తెలిపారు. శిశువుల్లో ఒకరు 700 గ్రాములు, మరోకరు 800 గ్రాములు, మరో ఇద్దరు 900 గ్రాముల బరువు వున్నారని వైద్యులు చెప్పారు. సాధారణంగా తొమ్మిది నెలలు నిండిన తరువాత జరగాల్సిన ప్రవసం.. కాస్తా గీతా దేవీ విషయంలో కేవలం ఏడు నెలలకే జరిగిందని వైద్యులు చెప్పారు.

శిశువులు బరువు తక్కువగా వున్నా.. త్వరగానే వారు శారీరకంగా ధృడంగా అవుతారని, ఈ విషయంలో అందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పెర్కోన్నారు. అరుదైన ఘటన సమాచారాన్ని తెలుసుకున్న వారి బందువులు, ఇంఫాల్ వాసులు పెద్ద సంఖ్యలో అస్పత్రికి చేరుకుంటున్నారు. తమ రాష్ట్రంలోనే ఇది తొలి ఘటనగా వారు తెలిపారు. శిశువులను చూసేందకు వస్తున్న బంధువులలో ఆస్పత్రి కిక్కిరిసిపోయింది.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur  Gita Devi  Five babies  Babies  Regional Institute of Medical Sciences  RIMS  Imphal  

Other Articles