Banks bandh from september 30 to october 6th

banks, banking times, sbi banks in andhrapradesh, sbi banks in telangana, banks in hyderabad, bank jobs, bank holidays, festivals, cash, money, financial, ecomomic news, latest news, banks duty, atm centers

with different reasons banks will remain closed for seven dasy starting from 30th september to 6th october of this year : with financial half year closings and festival holidays banks will closed for one week from 30th september to 6th october

వారం రోజలు బ్యాంకుల బంద్..

Posted: 09/25/2014 06:30 PM IST
Banks bandh from september 30 to october 6th

బ్యాంకు లావాదేవీలు చేసే వారు వెంటనే అప్రమత్తం కండి. ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉంటాయి. అందువల్ల ఎవరైనా.., ఎంత అత్యవసర పని ఉన్నా.., ఈనెల 29సాయంత్రం లోపు బ్యాంకు పని చేసుకోవాలి లేకపోతే అక్టోబర్ 7వరకు అంటే వారం రోజులు ఆగక తప్పదు. ఈ సెలవులను ఓ సారి చూస్తే.. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఆర్ధిక సంవత్సర అర్ధవార్షిక ముగింపు, ప్రారంభ తేదిల సందర్బంగా బ్యాంకులు లెక్కలు చేసుకుంటాయి. కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక అక్టోబర్ 2వ తేది ‘మహాత్మాగాంధీ’ జయంతి కావటంతో ఆ రోజు సెలవు దినం.

అక్టోబర్ 3వ తేది ‘దసరా’ పండగ కావటంతో ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. ఇక అక్టోబర్ 4వ తేది బ్యాంకులు పనిచేసినా.. శనివారం కావటంతో కేవలం రెండు గంటలు మాత్రమే విధులు ఉంటాయి. అక్టోబర్ 5వ తేది ఆదివారం అందరికి ‘సాధారణ సెలవు’, అక్టోబర్ 6వ తేది ముస్లింల పండగ ‘బక్రీద్’ దీంతో సోమవారం కూడా సెలవు. అంటే ఈ నెలాఖరు నుంచి అక్టోబర్ 6 వరకు 7రోజుల్లో కేవలం 2గంటలు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. డబ్బుల కోసం బ్యాంకులకు బదులు ఏటీఎం సెంటర్లకు వెళ్లటం ఎప్పటినుంచో పెరిగింది. ఇలాంటి సమయంలో బ్యాంకులు వారం రోజులు సెలవు పెడితే..,. ఏటీఎం మెషీన్లలో డబ్బు ఎవరు పెడతారో మరి.
 
ప్రధాన నగరాల్లో అయితే ప్రైవేటు సంస్థలు డబ్బులు పెట్టే కాంట్రాక్టు తీసుకుంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కాని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ఏటీఎం సెంటర్ల సంగతి ఏమిటి? అసలే పండగల సీజన్.. జీతాలు వచ్చి.. ఏమైనా కొనుక్కోవటానికి డబ్బులు తీస్తే రాలేదనుకోండి. మనకు మామూలుగా ఉండదు... కాబట్టి బ్యాంకు పనులు ముందే చూసుకోండి.. అదే విధంగా డబ్బులు దగ్గర పెట్టుకోండి. ఏటీఎం ఉంది కదా అనుకుని వెళ్తే ఈ వారం రోజుల్లో ‘ఎనీ టైం మెషీన్’ తప్ప ‘ఎనీ టైం మనీ’ రాకపోవచ్చు చూస్కోండి మరి.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : banks  bandh  atm machines  latest news  

Other Articles