Brazil court sentences main accused in rape case for 106 years

rape and murder, brazil, 106 years jail, brazil court, main accused

brazil court sentences main accused in rape case for 106 years

రేపిస్టులకు 106 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Posted: 09/27/2014 04:02 PM IST
Brazil court sentences main accused in rape case for 106 years

సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఓ మగమృగానికి న్యాయస్థానం 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మనిషి జీవిత కాలమే వందేళ్లు.. కానీ అంతటి దారుణ ఘాతుకానికి పాల్పడిన నేరస్థుడికి అతని జీవిత కాలం కూడా సరిపోని శిక్షను విధించింది బ్రిజిల్ కోర్టు. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తున్నానని పలువురు మహిళలను ఇంటికి ఆహ్వనించి వారిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కరుడు గట్టిన నేరగాడికి బ్రిజిల్ కోర్టు ఈ శిక్షను విధించింది. అంతేకాదు వారిలో ఇద్దరిని హతమార్చినందుకు గాను ఎడ్యూర్డో డాస్ శాంటాస్ పెరీరియా అనే నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది.

2012 సంవత్సరంలో క్వైమాడా నగరంలో ఈ నేరాలు జరిగాయి. తుది విచారణలో భాగంగా 19 గంటల పాటు మొత్తం నిందితులు అందరినీ విచారించిన జడ్జి.. తుదకు తన తీర్పును వెలువరించారు. నేరాలన్నింటికీ ముందుగా ప్లాన్ చేపి, ప్రణాళికా బద్దంగా వాటిని అమలు చేసిన శాంటాస్ పెరీరాపై అక్కడి పోలీసులు మోపిన అన్ని అభియోగాలు రుజువయ్యాయి. దాంతో అతడికి 106 ఏళ్ల జైలుశిక్ష విధించారు. నేరాలకు సహకరించిన ఆరుగురు నిందితులకు 26 నుంచి 44 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. రేపిస్టులలో ముగ్గురు మైనర్లు ఉన్నా.. వారికి ఎలాంటి మినహాయింపును ఇవ్వని న్యాయస్థానం.. నేరాలకు పాల్పడే సమయంలో మైనర్లుమని వారికి గుర్తు లేదా అని ప్రశ్నించింది.

శాంటాస్ పెరీరా తన ఇంట్లో నిర్వహించిన పుట్టినరోజు పార్టీ సందర్భంగా తన ఉపాద్యాయురాలితో పాటు మరో నలుగురిని విందు నిమిత్తం ఇంటికి పిలిచి వారిపై అత్యాచారానికి యత్నించాడు. ఇసబెల్లా ఫ్రజావో మాంటీరో (27) అనే టీచర్, మిషెల్ డోమింగ్యూస్ డ సిల్వా (29) అనే ఇద్దరిని హతమార్చాడు. దీంతో న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape and murder  brazil  106 years jail  brazil court  main accused  

Other Articles