Anna canteens to start in november

Ap government, anna canteens, start, november, drinking water, scheme, october 2nd, Narayana, hyderabad

Ap government's anna canteens to start in november, drinking water scheme on october 2nd

అన్నా క్యాంటీన్లు వచ్చేస్తున్నాయ్..

Posted: 09/27/2014 05:14 PM IST
Anna canteens to start in november

తమిళనాడులో అమ్మ క్యాంటిన్ల తరహాలోనే ఇక మన రాష్ట్రంలోనూ అన్నా క్యాంటిన్లు రానున్నాయి. నగరంలో వుండే పేదలు, కటిక దరిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారికి బోజనంతో పాటు అల్పాహారన్ని అందుబాటులోకి తీసుకురావలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తెరవనుంది. వీటి ద్వారా వారు కారుచౌకగా తమ ఆకలిని తీర్చుకోవచ్చనని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ నుండి అన్నా క్యాంటీన్లు ప్రజల అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

ఈ అన్నా క్యాంటీన్లలో ఒక రూపాయికే సాంబారు ఇడ్లీ సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఐదు రూపాయలకే లెమన్, పెరుగు, సాంబారు రైస్ తదితరరాలను పేదలకు అందిస్తామన్నారు. అంతేకాకుండా మరో ఐదు రూపాయలకే రెండు చపాతీలను సరఫరా చేస్తామన్నారు. వీటిలోకి కేవలం పేదలకే కాకుండా, పనులపై గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే వారికి కూడా సరఫరా చేస్తారని చెప్పారు. నిజానికి పేదలకు పట్టెడు అన్నం పెట్టాలన్న యోచనతో 1985లో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తరువాత స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నపూర్ణ హోటళ్లను స్థాపించారు. అప్పడు కేవలం నగరాలకు పరిమితమైన అన్నపూర్ణ క్యాంటీన్లను చంద్రబాబు పట్టణప్రాంతాలకు కూడా వ్యాపింపచేస్తున్నారు. ఏదేమైనా పేదల ఆకలిని తీర్చాలన్న సదుద్దేశం మంచిదే.  

అంతే కాదండోయ్.. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 2న 222 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆన్ లైన్ ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ శాఖలో 2240 మంది సిబ్బంది కోరతతో పాటు 2040 మంది అధికారుల కొరత వుందని ఆయన చెప్పారు. పన్నుల భారం లేకుండా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలను తమ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజల అవసరాలు ఏమున్నా ఫోటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు ఫోటో పంపిస్తామన్నారు. పట్టణాభివృద్ధి మిషన్ ను నూటికి నూరుశాతం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap government  anna canteens  start  november  drinking water  october 2nd  Narayana  hyderabad  

Other Articles