Jayalalithaa convicted for four year jail in disproportionate assets case

Jayalalithaa Jayaram, Sasikala, All India Anna Dravida Munnetra Kazhagam, Dravida Munnettra Kazhagam, tense situation, tamilnadu, banglore court, CM, guilty, assets case, kernataka

Jayalalithaa fined Rs 100 crore, gets four-year jail in disproportionate assets case

అక్రమ ఆస్థుల కేసులో అమ్మ కు నాలుగేళ్ల జైలు శిక్ష

Posted: 09/27/2014 05:55 PM IST
Jayalalithaa convicted for four year jail in disproportionate assets case

ఊహించినట్టే జరిగింది, ’అమ్మ‘ కంట కన్నీరు ఒలికింది. పురాషాదిక్య తమిళనాడు అసెంబ్లీలో అవమానాలను భరించి, పడిలేచిన కెరటంగా నిలిచిన అన్నాడిఎంకే పార్టీ అదినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు అగ్రహారం కోర్టు దోషిగా పరిగణించి, నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. తమిళనాట తనకంటూ ప్రత్యకతను చాటుకున్న జయలలితను ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధరించిన బెంగళూరులోని అగ్రహారం ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యేః పదవికి అమె రాజీనామా చేయనున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం దోషులు నలుగురికి కలిపి రూ.100 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని దోషులు ఒక్కొక్కరు రూ.25 కోట్లు చొప్పున చెల్లించాలని తీర్పులో న్యాయస్థానం వెలువరించింది.

జయలలిత దోషిగా నిర్ధరణ

బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థరించింది. దాదాపు 18ఏళ్లపాటు సాగిన కేసు విచారణలో 14మంది జడ్జిల సమక్షంలో విచారణ జరిగింది. 259 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, 99 మంది డిఫెన్స్ సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై కేసు నమోదైంది. జయలలితతో పాటు ఆమెకి అత్యంత సన్నిహితురాలైన శశికళ, ఆమె కుమారుడు సుధాకర్, బంధువు ఇళవరసి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిపిన సోదాల్లో 880 కిలోల వెండి, 28కిలోల బంగారం, 10వేలకు పైగా చీరలు, 90కి పైగా వాచీలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలొచ్చాయి. కేవలం ఒక్కరూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారని అభియోగం నమోదైంది. జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా... మళ్లీ జయలలిత సీఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. డీఎంకే పిటిషన్‌తో జయలలిత కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.
 
పదవులకు దూరంగా ‘ఆరేళ్లు’

అదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జయలలిత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళు లేదు. ఈ మేరకు న్యాయస్థానం అమెపై అనర్హతను విధించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముఖ్యమంత్రి జయలలిత దోషిగా తేలడంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అన్నాడీఎంకే శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు ఆర్టీసీ బస్సులపై దాడులకు పాల్పడుతుండటంతో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే బస్సులను నిలిపివేశారు. కాంచీపురంలో ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు పలు నగరాలు, పట్టణాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తుండగా... మరికొన్ని చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు బలవంతంగా దుకాణాలు మూసేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నివాసం ముట్టడికి అన్నాడీఎంకే కార్యకర్తలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కేబుల్ కనెక్షన్లు నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అటు అక్రమాస్థుల వ్యవహారంలో కోర్టులో కేసు వేసిన బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామి ఇంటిపై కూడా ఆందోళనకారులు రాళ్లతో దాడులు చేశారు.

రాష్ట్రపతి పాలనను కోరుకోవడంలేదు: డీఎంకే

ముఖ్యమంత్రి జయలలిత అదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో డీఎంకే స్పందించింది. తమిళనాడు శాసనసభను రద్దు చేయాలని తాము కోరడం లేదని పేర్కొన్నాయి. అలాగని రాష్ట్రపతి పాలనను కూడా కోరుకోవడం లేదని స్పష్టం చేశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tense situation  tamilnadu  banglore court  CM  jayalalitha  guilty  assets case  kernataka  AIADMK  DMK  

Other Articles