Jayalalithaa in police custody

Jayalalitha, Sasikala, tense situation, tamilnadu, banglore court, CM, guilty, assets case, karnataka

Jayalalithaa Appeared before the court personally four times and answered 1339 questions

సోలీసుల కస్టడీలోకి జయలలిత..

Posted: 09/27/2014 09:55 PM IST
Jayalalithaa in police custody

తన చూట్టు ఉచ్చు బిగుసుకుంటుందని అమ్మకు అర్థమయ్యింది. అనారోగ్యంగా వున్నా కోర్టుకు స్వయంగా హజరైంది. అమెకు తెలుసు తన జీవితంలో ఇదోక దుర్థినమని, గతంలో ఇలాంటి దుర్థినాన్ని చూవిచేసినా.. అప్పడే తప్పని జైలు.. ఇప్పడూ తప్పించుకోలేనని తెలుసు. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని కోర్టు హాలులో దోషిగా నిల్చుంది. అమే తమిళనాట ప్రజలు ముద్దుగా అమ్మ అని పిలుచుకునే జయలలిత. ప్రత్యేక న్యాయస్థానం అమెను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. శిక్ష ఖరారు కావడంతో పోలీసులు అమెను తమ కస్టడీలోకి తీసుకున్నారు. తీర్పు వెలువడగానే జయలలిత అస్వస్థతకు గురయ్యారు. అమెకు చాతిలో నొప్పి రావడంతో అసుపత్రికి తరలించిన పోలీసులు అమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రోశయ్య తమిళనాడు డీజీపి రామానుజంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం.

4 పర్యాయాలు.. 1339 సమాధానాలు..పలుమార్లు తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అమె స్వయంగా బెంగళూరు అగ్రహార కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట హాజరై సీబీఐ అడిగిన సుమారు 1339 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. చివరకు అమె దోషిగా నిర్థారణ కావడం.. కోర్టు అమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడం, 100 కోట్ల రూపాయలను జరిమానా విధించడం.. అరేళ్ల పాటు అమెపై అనర్హత వేటు వేయడం జరిగిపోయాయి. కాగా, బెంగళూరులోని అగ్రహార ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైకోర్టుకు అప్పీలు చేయనున్నారు. ఈ మేరకు ఆమె న్యాయవాదులు పై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అయితే ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో మాత్రమే అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉందని న్యాయవర్గాలు తెలిపాయి.

వారసులపై చర్చ..

తమిళనాడు సీఎం జయలలితకు కోర్టు శిక్ష విధించడంతో ఆమె వారసులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఆమె రాజీనామా చేసిన సందర్భంలో వీరవిధేయుడిగా పేరున్న పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయనకే తిరిగి మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను కట్టబెడతారా..? లేక మంత్రివర్గంలో సుచ్చరితులుగా పేరొందిన బాలాజీ, తదితరులకు కట్టబెడతారా..? అనే అంశంపై సంగిద్ధత నెలకోంది.

గతం మళ్లీ పునరావృతం..

జయలలిత ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి చాలా అటుపోట్లను ఎదుర్కోన్నారు. 2001లో రెండో పర్యాయం అధికారాన్ని తిరిగి చేపట్టిన జయలలితకు చేదు అనుభవం ఎదురైంది. అమెపై వున్న అక్రమాస్థుల కేసులో భాగంగా ఎన్నికల సంఘం అమె నామినేషన్ ను స్వీకరించలేదు. ఆ ఎన్నికలలో తన పార్టీకి తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కానీ పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కోంటున్న జయలలిత.. ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలని, అమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుక పిలిచారని సుప్రీంకోర్టు  అప్పటి గవర్నర్ పాతిమా బీవీని ప్రశించింది. సర్వోన్నత న్యాయాస్థానం అదేశంతో పదవిని వదులుకున్న జయలలిత.. తన మంత్రిమండలిలోని పన్నీరు సెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అ తరువాత మద్రాసు హైకోర్టులో తనపై దాఖలైన కేసులను గెలిచిన తరువాత 2002లో ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలను చేపట్టింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  Sasikala  tense situation  tamilnadu  CM  guilty  assets case  karnataka  AIADMK  DMK  

Other Articles