Who is the next cm of tamilnadu

Jayalalithaa, Sheela Balakrishnan, O Paneerselvam, AIADMK, cm candidate

Jayalalithaa looks out for cm candidate

తమిళనాడు సీఎం రేసులో.. ఆ ముగ్గురు..

Posted: 09/28/2014 11:21 AM IST
Who is the next cm of tamilnadu

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. సీఎం కుర్చీ ఖాళీ కావడంతో ప్రభుత్వంలో సైతం సీను మారిపోగా, కాబోయే సీఎం ఎవరనే అంశంపై ఊహాగానాలు షికార్లు కొడుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి. జయకు జైలు శిక్ష పడిన పక్షంలో మళ్లీ ఆమె బయటకు రాగానే సీఎం కుర్చీని అప్పగించే వ్యక్తికే ఇప్పుడు ఆ పదవి వరిస్తుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేచింది.
 
బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పేందుకు వారం రోజుల ముందు నుంచే శిక్షపై అనుమానం వచ్చిన జయలలిత ముందునుంచే ముగ్గురు విశ్వాస పాత్రులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 2001లో జరిగిన పరిణామాలను ముందుగానే ఊహించిన జయలలిత.. అధికారంలో వుంటూ అటు ప్రజల్లో తన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నించారని, దీంతో పాటు పార్టీలోనూ నమ్మకమైన నేతలను సిద్దం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఇద్దరు మంత్రులు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారిణి అని అంటున్నారు.

ఎంజీ రామచంద్రన్ హయాం నుంచి జయకు అత్యంత విశ్వసనీయపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ పన్నీర్‌సెల్వం, రవాణాశాఖా మంత్రి సెంధిల్ బాలాజీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ పేరును సైతం అమ్మ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన షీలాకు మంచి పరిపాలనా అనుభవం ఉండడంతో ఆమె పేరును కూడా జయలలిత పరిశీలిస్తున్నట్లు సమాచారం. జయలలితకు అత్యంత నమ్మకస్తురాలు కావడం చేతనే రిటైర్మెంటు అయిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా షీలాను ఆమె తన వద్దనే ఉంచుకున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం సీఎం పదవి దక్కించుకోవడానికి ఈ ముగ్గురిలో షీలాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అమ్మకు దత్తపుత్రుడిగా పేరొందిన సెంథిల్ బాలాజీ నమ్మకస్తుడైనా వయస్సు, అనుభవ రిత్యా చిన్నవాడు కావడంతో ఆమె సెంధిల్ పేరును పరిశీలిస్తారా..? లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
 
2001లో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చిన సందర్భంలో అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వంకు అప్పట్లో సీఎం పదవిని అప్పగించారు జయలలిత. అయితే సహజంగా ఎవరికీ రెండోసారి మంచి అవకాశం ఇచ్చే అలవాటులేని జయలలిత.. పన్నీర్‌సెల్వంను మరోసారి అవకాశం ఇస్తారా..?  లేక పక్కన పెడతారా అన్నేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారనుంది. పార్టీ పరంగా అనుభవజ్ఞుడైన పన్నీర్‌సెల్వంకు పార్టీ బాధ్యతలను అప్పగించడడంతో పాటు, పరిపాలనా పరంగా అనుభవం, ఉన్నత విద్యార్హత కలిగిన షీలా బాలకృష్ణన్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల సమాచారం. తాజా తీర్పును కలుపుకుంటే జయ రెండుసార్లు జైలుకెళ్లినా సీఎం హోదాలో కటకటాలపాలు కావడం ఇదే మొదటిసారి. ఈ అప్రతిష్ట రాబోయే ఎన్నికల్లో పార్టీ జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని.. దీంతో పార్టీకి ఇది అపఖ్యాతిలా వుండకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జయలలిత యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
గత ఎన్నికల్లో డీఎంకే నేతల అవినీతి కేసులను ప్రచారస్త్రాలుగా చేసుకున్న జయలలిత.. ఆ ఎన్నికలలో విజయం సాధించినట్లుగానే.. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు.. జయలలితకు పడిన శిక్షను ప్రధానాస్త్రంగా మార్చుకుంటాయని.. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను దీటుగా ఎదుర్కొని పార్టీని అధికారంలో తేవాల్సిన బాధ్యత మరోకరికి అప్పగించాలని కూడా జయలలిత అలోచిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కాలం తనకు పడిన జైలు శిక్షను సానుభూతిగా మార్చడంలో క్రీయాశీలకంగా వ్యవహరించే నాయకుడికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని అమె యోచిస్తున్నట్లు సమాచారం.మళ్లీ అధికార పీఠాన్ని ఎక్కించగలిగే నేతకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని అందుకే విశ్వాసపాత్రుడైన  పన్నీర్‌సెల్వంపై పార్టీ బాధ్యతలను పెట్టి, ప్రభుత్వ పగ్గాలను షీలా బాలకృష్ణన్‌కు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు అందుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Sheela Balakrishnan  O Paneerselvam  AIADMK  cm candidate  

Other Articles