New law for women security in telangana says kcr

TRS Plenary, CM KCR, Women Security, new law, telangana government

new law for women security in telangana says kcr

మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం

Posted: 10/05/2014 08:36 PM IST
New law for women security in telangana says kcr

మహిళలు మన ఆడపడుచులని మరిచి మానవ మృగాళ్ల మాదిరిగా వ్యవహరించే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. రోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారి పట్ల కనికరం లేకుండా వ్యవహరించాలని యోచిస్తోంది. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

నేరాల్లో హైదరాబాద్ నగరం ఢిల్లీలా తయారైందని, హైదరాబాద్‌లో అమ్మాయిలను వేధిస్తే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. నెలరోజుల తర్వాత అల్లరి మూకల్ని సహించేది లేదన్నారు. అమ్మాయిలను వేధిస్తే ఏం చేయాలో అది చేస్తామన్నారు. వేధింపులకు పాల్పడే వారి కళ్లు పీకే కార్యక్రమాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. వివాదమైనా పర్వాలేదని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 11, 12న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్టుతెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ, పరేడ్స్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో 4 వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బడ్జెట్ తర్వాత హైదరాబాద్ లోని ఉండనని, ప్రజల మధ్యలోనే ఉంటానని వెల్లడించారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందించకపోతే మళ్లీ ఓట్లు అడగనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరో అడిగారని పాలనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని, ఆచితూచి అడుగేస్తామని, ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందామని, ప్రజలే టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు.

ఉద్యమకారులు ఎవరో, కానివారు ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. కొన్ని పార్టీల నాయకులు కనీస జ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు గత పాలకులు బాధ్యులు కారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాలేదని అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారం ముఖ్యం కాదని, పదవులు వస్తుంటాయి, పోతుంటాయి అన్న కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను నెరవేర్చి తీరతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS Plenary  CM KCR  Women Security  new law  telangana government  

Other Articles