A r rahman and lata mangeshkar powers women empowerment

A.R. Rahman, Lata Mangeshkar, Women Empowerment, kapil sibal, legends

A.R. Rahman And Lata Mangeshkar powers Women Empowerment

మహిళల సాధికారతకు సీనీ దిగ్గజాల మహోద్యమ గీతం..

Posted: 10/08/2014 10:34 AM IST
A r rahman and lata mangeshkar powers women empowerment

మహిళల సాధికారతను పెంచే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నా.. తమ వంతుగా కూడా ఎదో చేయాలని భావించారు వాళ్లు. పురుషహంకార సమాజంలో మహిళల్ని జాగృతం చేయాలని భావించారు. మహిళల సాధికారతతో దేశం రూపురేఖలు మారుతాయని వారు విశ్వసించారు. అందుకే మహిళలు దీర్ఘకాలికంగా ఎదురీదుతున్న కష్టాల కడలిని దాటాలని వారు వారి పంథాలో పోరాటానికి శ్రీకారం చుట్టారు.

భారత నైటింగేల్ గా పేరొందిన లతా మంగేష్కర్.. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రహమాన్ లు కూడా మహిళల సాధికారత కోసం ఉద్యమించారు. వీధుల్లోకి వెళ్లి మహిళల సాధికారత గురించి ఉపన్యసించలేని వీరు తమ పంథాలో మహిళల సాధికారతకు దోహదం చేసేలా ఒక చక్కని పాటను రచించారు. వందేమాతం అన్న పాట భారతీయులందరినీ ఒక్క తాటిపైకి తీసుకోచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో మహోజ్వలిత ప్రేరణకు ఎలా ఉపకరించిందో.. అదే విధంగా.. మహిళ సాధికారతకు ఈ పాట ఊపిరి పోస్తుందని ఆశిస్తున్నారు.

మాజీ కేంద్ర మంత్రి కపిల్ సబల్ కూడా తన వంతు సాయం చేశారు. తన కలం నుంచి జాలువారిన పదాలను ఏ.ఆర్ రహమాన్ కు అందించగా, ఆయన స్వరాన్ని సమకూర్చారు. లతా మంగేష్కర్ ఆ పాటను అద్వితీయంగా ఆలపించారు. దిగ్గజాలు కలసి.. మహిళా సాధికారతకు సాయం అందించగా, ఇక వారి ఉద్యమానికి వెయ్యేనుగుల బలం చేకూరినట్టే. ఈ పాట మహిళల సాధికారతకు దోహదపడాలని మనమూ ఆశిద్దాం..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A.R. Rahman  Lata Mangeshkar  Women Empowerment  kapil sibal  legends  

Other Articles