Legal notice to revanth reddy on false allegations

Revanth reddy, legal notice, My Home, rameswara rao, metro rail, false allegations

my home rameswara rao sends legal notice to revanth reddy on false allegations

నోరు జారలేనా.. నోటీసు అందుకోనేలా..

Posted: 10/08/2014 03:13 PM IST
Legal notice to revanth reddy on false allegations

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టర్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కూడా కష్టాలు తప్పేట్లు లేవు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఆయన.. ఇప్పడు పీకల్లోతు కష్టాల్లో వున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే పర్వాలేదు కానీ, లేనిపోని అరోపణలు చేస్తే.. ఏమతుందో ఇప్పడు రేవంత్ కు తెలిసివచ్చినట్లుంది.

రెండు ప్రముఖ మీడియా సంస్థలు తెలంగాణ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కథనాలను ప్రసారం చేశాయి. తరువాత.. ఏం జరిగిందో.. ఇప్పటికీ అవి తెలంగాణలో కార్యక్రమాలను ఎందుకు ప్రసారం చేసుకోలేక పోతున్నాయో అన్ని తెలిసిన రేవంత్.. ఎందుకిలా చేశాడు. తన వద్ద సాక్షాలు, ఆధారాలు వున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు సంధించారు. అవే ఇప్పడాయన మెడకు ఉచ్చుగా మారాయి.

తనకు సంబంధంలేని విషయాల్లోకి తనను లాగి, తన పరువుకు నష్టం కలిగించినందుకు గానూ మై హోం కన్‌స్ట్రక్షన్స్ రామేశ్వరరావు.. రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందంటూ 90 కోట్ల రూపాయలకు లీగల్ నోటీసులు ఇచ్చారు.

మెట్రో రైలుకు కేటాయించిన భూమిని.. రామేశ్వరరావు భాగస్వామిగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు ఇచ్చారని టీడీపీ ఆరోపించగా... అదేమీ లేదని, తమ భూమి తమ వద్దనే ఉందని ఎల్‌అండ్‌టీ వివరణ ఇచ్చింది. అయినా తగ్గని టీడీపీ.. రామేశ్వర్‌రావుకు కేసీఆర్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని, బహిరంగ చర్చకు రావాలని సవాళ్లకు దిగింది. ఈ విషయమై ఇటీవల రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి.

మరోవైపు రేవంత్ రెడ్డి ఇంకా ధీమాగా వున్నారు. లీగల్ నోటీసులపై స్పందిస్తూ తాను చేసిన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా నోరు జారానేలా.. నోటీసులు అందుకోనేలా అంటూ పలువరు చర్చించుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  legal notice  My Home  rameswara rao  metro rail  false allegations  

Other Articles