మరో పెను తుఫాను కోస్తా తీరాన్ని తాకనుంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం మారి తుపానుగా రూపాంతర చెంది అండమాన్, నికోబార్ దీవుల తీర ప్రాంతాన్ని బుధవారం తాకింది. ఈ నెల 12 లేదా మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా ప్రాంతం, ఒడిశా రాష్ట్ర తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్ర తీరంలో బుధవారం ఉదయం ఏర్పడిన అల్ప పీడనం తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్, నికోబార్ తీర ప్రాంతం మయాబందర్ తీరానికి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో తుపాను తాకిడికి గురైందని తెలిపారు.
రానున్న 24 గంటల్లో తుపాను పెనుతుఫానుగా తీవ్ర రూపం దాల్చనుందని చెప్పారు. పశ్చిమ, వాయవ్య దిశగా తుపాను కదులుతోందని తెలిపారు. అక్టోబర్ 12లోపు భారత తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీరం, ఒడిశాలోని కళింగపట్నం, పారదీప్ తీరాలకు అక్టోబర్ 12 రాత్రి వరకు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల్లో 175-185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కోల్కతా రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వారు తెలిపారు.
ఒడిశా తీర ప్రాంత జిల్లాలతోపాటు 16 జిల్లాల కలెక్టర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తుపాను వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస శిబిరాల ఏర్పాటు, తదితర విషయాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఒడిశా ప్రభుత్వం తెలియజేసింది. ఎలాంటి విపత్కర పరిణామాలైనా ఎదుర్కొనేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సిద్దంగా వుంది. తుఫాను ప్రభావిత జిల్లాలలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది.
ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more