ఆఫీసుల్లో పనిచేస్తున్నారా..? సంతోషంగా వున్నారా..? కాలు కదపకుండా కుర్చీలో కూర్చోనే ఉద్యోగం వచ్చింది.. ఏదో చేసుకుంటున్నాం అంటారు.. అంతేగా.. మీరు అదృష్టవంతులే.. కానీ ఆరోగ్య వంతులు కూడా కావాలంటే చిన్న చిన్న విషయాలను ఆచరించాలి. ఆహర వ్యవహారాల్లో స్వల్ప మార్పలను చేసుకోవాలి. అంతే మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. మీరు జాగ్రత్త వహించని పక్షంలో మీ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. మీ పోట్ట విపరీతంగా పెరిగి, మీకే ఇబ్బందిగా మారే పరిణామాలు ఉత్పన్నం కావచ్చు.
ఎక్కువసేపు కదలకుండా కూర్చొని ఉంటారు. ఇలా పనిచేసే వాళ్లు తమ ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల పొట్ట వస్తుంది. ఇది వచ్చిందంటే.. ఆ వెంటే పలు రకాల జబ్బులూ వెన్నంటి వస్తాయి. ఇటువంటి సమస్యలేవీ రాకుండా ఉండాలంటే ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ తమ ఆహారం మార్పలు చేసుకోవాలి.
ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఉండడం తప్పనిసరి. ఇందుకోసమని రెండు పుల్కాలు, రాజ్మా కూర లేదా బ్రౌన్‌రైస్‌తో గుడ్డు, కూరలు తినాలి. లేదంటే చీజ్ శాండ్‌విచ్ తినొచ్చు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న భోజనం తీసుకుంటే పొట్ట రాదనే విషయం మీకు తెలుసుకదండీ. సాయంత్రాలు తీసుకునే స్నాక్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. వీటి వల్లే పొట్ట చుట్టూ బరువు పెరుగుతుంది. నూనె పదార్థాలైన బజ్జీ, సమోసా, పఫ్స్ వంటివి అస్సలు తినకూడదు. వాటికి బదులు ఫ్రూట్ సలాడ్, పొట్టు తీయనిగింజలతో తయారుచేసిన చాట్, మొలకెత్తిన గింజల వంటివి తినాలి. ఆ తరువాత గ్రీన్ టీ తాగితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ తరువాత వీలు కుదిరతే చిన్న శారీరక వ్యాయామం చేస్తే భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.
ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకి ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఎక్కువసార్లు టీ తాగడం వల్ల భోజనం వాయిదా వేస్తారు. కొందరయితే టీతో పాటు సిగరెట్లు కూడా తెగ పీల్చేస్తారు. ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. లేదంటే అల్సర్లు, కేన్సర్ల ముప్పు మీద పడడం ఖాయం. అందుకని రోజు మొత్తంలో ఎక్కువలో ఎక్కువ మూడుసార్లు టీ తాగాలి. అదికూడా ఒకటిన్నర టీస్పూను చక్కెరతో మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం, స్నాక్స్ తినే అలవాటు చేసుకుంటే అతిగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో కూడా పోట్ట రాకుండా వుంటుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more