Concerns raises over use of aadhaar as address proof

Aadhaar card, home ministry, new delhi, Ministry of Home Affairs, concern, address proof, valid information

Ministry of Home Affairs raises concerns over use of aadhaar as address proof, questions how can we take it as valid information,

ఆధార్ కార్డుల భవితవ్యంపై నీలినీడలు..

Posted: 10/10/2014 08:19 AM IST
Concerns raises over use of aadhaar as address proof

ఆధార్ కార్డులను ప్రామాణికంగా చేసుకుని పలు రాష్ట్రాలు.. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలకు అనుసంధానం చేసినా.. వాటిని ఎలా విశ్వసిస్తమాని కేంద్రం ప్రశ్నించడంతో.. ఆధార్ కార్డుల భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ మేరకు ఆధార్ పై అనుమానాలను వ్యక్తం చేసింది కేంద్రంలోని హోం మంత్రిత్వ శాఖ. ప్రభుత్వాలు మారగానే యావత్ రూపురేఖలు మారతాయనడానికి ఇది నిదర్శనం. గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జారీ అయిన ఆధార్ కార్డులను ఎలా ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. చివరకు ఆధార్ కార్డును రెసిడెన్షియల్ ఫ్రూప్ గా వినియోగించేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతోంది.

టెలికాం శాఖ ప్రతిపాదిత ఆన్‌లైన్ వెరిఫికేషన్ వ్యవస్థలో ఆధార్ కార్డును చిరునామా ధ్రువపత్రం ఉపయోగించాలన్న అంశంపై కేంద్ర హోం శాఖ పలు ఆందోళనలు వ్యక్తంచేసింది. ఆధార్ కార్డుల్లో ఉన్న సమాచారమంతా నిజమనిగాని, ప్రామాణికమనిగాని నమ్మలేమని పేర్కొంది. విశిష్ట గుర్తింపు కల్పించే అంశంలో ఆధార్ పక్కాగా ఉందని, అయితే విశిష్ట గుర్తింపు ఉన్నంత మాత్రాన అది ప్రామాణికమైన గుర్తింపనిగాని, అందులోని ఇతర సమాచారమంతా నిజమనిగాని నమ్మలేమని హోంశాఖ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి
 
దేశంలో ఉంటున్న విదేశీయులకు కూడా ఆధార్ ఇవ్వడానికి అవకాశముందని, అలాంటప్పుడు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటే.. పొరుగు దేశాల జాతీయులు తమ ఏజెంట్లను ఇక్కడ చొప్పించడం కోసం భారత గుర్తింపు పత్రాలు పొందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో ఆధార్ కార్డు భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది నిజమేనని చెప్పాలి. ఆధార్ కేంద్రాలకు మనం వెళ్లి సమాచారాన్ని ఇచ్చిం తప్పితే.. ఆధార్ కార్టులు జారీ చేసే అధికారులు వచ్చి.. సమాచారం నిజమని రూఢీ చేసుకున్న ధాఖలాలు లేవు. ఇలాంటి సందర్భంలో మనం ఇచ్చే సమాచారాన్ని ఎలా పక్క సమాచారంగా పరిగణిస్తారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సీడీ సలిండర్లను ఆధార్ తో లింక్ చేసిన సందర్భంలో వచ్చిన పిర్యాదులను పరిగణలోకి తీసుకుని వాటిపై కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సందేహాలను వ్యక్తం చేస్తోంది. కాగా ఆధార్ కోసం ఇన్సోసాఫ్ట్ సంస్థ యుడాయ్ తో చేసుకున్న వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఇక బూడిదలో పోసిన పన్నీరేనా.? ప్రభుత్వాలు మారినంత మాత్రన కొత్త ఫథాకాలు రావాలా..? వీటికి కారణం గత ప్రభుత్వాలపై వారికి నమ్మకం లేకపోవడమేనా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారిని మారని విధంగా నిర్ణయాలు  వుండేలా ఇప్పటికైనా కేంద్రంలో కొలువుదీరని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృద్ధా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా..? రాజ్యాంగంలో మార్పలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

అయితే ఆధార్ కార్డులను పక్కా సమాచారంగా పరిగణలోకి తీసుకున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన, పెడుతున్న పలు సంక్షమ పథకాలకు ఆధార్ కార్డులను లింక్ చేశారు. కేంద్రమే అనుమానాలను వ్యక్తం చేసిన సందర్భంలో ఇక రాష్ట్రాలు వాటిని ప్రామాణికంగా తీసుకవడంలో అర్థమే వుండదు. అందుకని రాష్ట్రాలు ఆధార్ కార్డులో అనుసంధానం చేసిన పలు సంక్షేమ పథకాలను అందరికీ వర్తింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles