Jayalalitha fans and aidmk activists offer prayers for jayalalitha

jayalalitha wiki, jayalalitha bail, jayalalitha arrest, jayalalitha case, jayalalitha sashikala relationship, jayalalitha news, jayalalitha latest updates, jayalalitha news updates, jayalalitha bail plea, aidmk leaders, aidmk party, aidmk on jayalalitha, karunanidhi on jayalalitha, latest updates, tamilnadu news, latest tamil news, politics, gossips, supreme court, karnataka high court, bangalore court on jayalalitha, prayers for jayalalitha

on sunday tamilnadu state wide temples covered with jayalalitha fans and aidmk leaders and activists : ministers, leaders and fans of jayalalitha done special prayers for her release

అమ్మకోసం ఆదివారం అంకితమిచ్చారు

Posted: 10/13/2014 10:38 AM IST
Jayalalitha fans and aidmk activists offer prayers for jayalalitha

తమిళనాడు మాజి ముఖ్యమంత్రి జయలలిత విడుదల కోసం అన్నాడీఎంకే పార్టీ నేతలు.., అభిమానులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆమె తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.., పార్టీనేతలు, కార్యకర్తలు తమవంతుగా భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. తమిళ ప్రజలు ‘అమ్మ’గా పిలిచే జయకోసం ఆదివారం రోజు కార్యకర్తలు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. కిందిస్థాయిలోని నేతలు, కార్యకర్తలు జయలలిత విడుదల కావాలంలూ ఆలయాల్లో పూజలు చేశారు. కొందరు గుండు గీయించుకుని మొక్కులు తీర్చుకుంటన్నారు. మరికొందరు సుబ్రహ్మణ్యస్వామికి ఉత్సవాలు నిర్వహించారు.
 
తమిళనాడు రాష్ర్టం ఆదివారం రోజు అమ్మకోసం అంకితమిచ్చినట్లుగా మారింది. జయకోసం ప్రత్యేక పూజలతో పాటు హోమాలు, యాగాలు చేశారు. మరికొందరు అభిమానులు ఉత్సవాలు చేసినట్లుగా కావళ్ళతో, శూలాలను గుచ్చుకుని దేవుడిని ప్రార్ధించారు. కొంతమంది రథాలు లాగి తమ నేతను విడుదల చేయాలని వేడుకున్నారు. ఇక సుబ్రహ్మణ్య స్వామికి వేల పాలబిందెలతో మంత్రి కే.రాజు, గోపాలకృష్ణన్ నేతృత్వంలో అభిషేకం నిర్వహించారు. ఇంకొందరు అయితే జయ కోసం కాలి నడకన తిరుపతికి వెళ్ళారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా జయపై అభిమానం చాటుకున్నారు.
 
అటు మంత్రులు కూడా తక్కువేమి తీసిపోలేదు. రోజు పాలనతో బిజీగా ఉండే మంత్రులు.., ఆదివారం సెలవు దినం కావటంతో బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా వీరి వెంట వచ్చారు. ఆదివారం కావటంతో అందరిలాగానే అమ్మ కూడా ములాఖత్ అవుతుంది అనుకున్నారు. అయితే సాయంత్రం వరకు జైలు బయటే పడిగాపులు కాచినా జయ మాత్రం కరుణించలేదు. దీంతో అమ్మను చూసే అదృష్టం తమకు లేదు అనుకుని బయల్దేరారు. అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 27న జయలలిత అరెస్టయ్యారు. కర్ణాటక హైకోర్టు జయ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా.., సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ దాఖలు చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  prayers  jail  aidmk  

Other Articles