Delhi highcourt takes special class to delhi police

police, indian police, hyderabad police, delhi police, ap police, telangana police, hyderabad traffic police, police enquiry process, police duties in india, indian police duties, latest updats, police in movies, telugu movies, comedy movies, police story movies, latest updates, tollywood, bollywoood, hollywood, koliwood, delhi high court

delhi high court takes special class to delhi police about their old way of enquiry and tme over process of witness, case filing procedure : police must think why in 4 of 10 movies police showed as buffoons says delhi highcourt justice

పోలిసులంటే బఫూన్లు.., నర్సరి పిల్లలు

Posted: 10/13/2014 11:10 AM IST
Delhi highcourt takes special class to delhi police

పోలిసుల ప్రవర్తన., వారి విధి నిర్వహణపై విసుగెత్తి న్యాయమూర్తులు అన్న మాటలు ఇవి. పోలిసుల విచారణ పద్దతులు.., కేసులు ధర్యాప్తు చేసే విధానం పట్ల న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలిసులకు శనివారం రోజు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు పోలిసుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాతకాలపు పద్దతులతో జరుగుతున్న విచారణల వల్ల కొందరు నేరస్తులు తప్పించుకుంటుండగా కొందరు అమాయకులకు న్యాయం జరగటం లేదన్నారు.

కేసు ధర్యాప్తు.., సాక్ష్యాల సేకరణలో కొత్త పద్ధతులు పాటించాలన్నారు. మారుతున్న పరిస్థితులు, సామాజిక అభివృద్ధికి అనుగుణంగా పోలిసుల పనితీరు ఉంటేనే అందరికి న్యాయం జరుగుతుందని న్యాయమూర్తులు అన్నారు. ఈ సందర్బంగా పోలిసుల ప్రవర్తనపై వారు ఒక కామెంట్ చేశారు. ‘ ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే.., 10 చిత్రాల్లో నాలుగింటిలో పోలిసులను బఫూన్లుగా, అమాయకులు.., కామెడి క్యారెక్టర్లుగా చూపిస్తున్నారు’. అలా ఎందుకు జరుగుతుందో అంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పోలిసులు అభివృద్ధి చెందకపోవటం వల్లే వారిపై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అన్నారు. ఇందుకు 2013లో వెల్లడయిన ఓ కేసు తీర్పును ఉదహరిస్తూ పోలీసుల వైఫల్యాలను ఎత్తి చూపారు.

అదే విధంగా మరో కేసును వివరిస్తూ.., ఢిల్లీ పోలీసుల ప్రవర్తన పూర్తిగా యాంత్రికంగా ఉంటుందన్నారు. వాస్తవాలకు దగ్గరగా కేసు ధర్యాప్తు.., ఆధారాలు ఉండటం లేదన్నారు. స్వీయ ధర్యాప్తు, లోతైన విశ్లేషణలు వదిలేసి నిందితులు, సాక్షులు చెప్పింది రాసుకుని ‘నర్సరీ రైమ్స్ పాడే చిన్న పిల్లల్లా పోలిసులు ప్రవర్తిస్తున్నారు’. అని ఎద్దేవా చేశారు. ఇలా ఢిల్లీ పోలిసులు నిర్వహించిన వర్క్ షాప్ లో వారిపై కౌంటర్లు బాగానే పడ్డాయి. ఇదే సందర్బంలో ఢిల్లీ కాప్స్ కు పలు సలహాలు కూడా ఇచ్చారు. వర్క్ షాపులో పలువురు పోలిసులతో పాటు ఢిల్లీ పోలిస్ కమిషనర్ బీఎస్ బస్సీ పాల్గొన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : polie  buffoons  delhi high court  movies  

Other Articles