Tollywood gives assistance to andhrapradesh government

tollywood heros, assistance, andhrapradesh government, declare, donations, cm relief fund

tollywood heros declare donations to andhrapradesh cm relief fund

హుద్ హుద్ బాధితులకు టాలీవుడ్ అగ్ర హీరోల విరాళాలు

Posted: 10/14/2014 06:42 PM IST
Tollywood gives assistance to andhrapradesh government

ప్రళయభయంకరంగా దూసుకువవచ్చిన హుద్ హుద్ తుపాను.. ఉత్తరాంధ్రలో సృష్టించిన బీభత్సాన్ని చూసి ఒక్కరుగా అందరు స్పందిస్తున్నారు. తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను అదుకునేందుకు మేమున్నామంటూ కదులుతున్నారు. దేశం నలుమూల నుంచి తెలుగువారందరూ అపన్నహస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరోలు తమ ఉదారతత్వాన్ని చాటుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్. నుంచి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వరకు హీరోలు తామున్నామంటూ బాధితులకు ధైర్యాన్నిచ్చారు.

తుపాను బాధితులకు తన వంతు సాయంగా మొత్తంగా 15 లక్షల రూపాయలను అందించనున్నట్లు ఉదయన్నే హీరో రాంచరణ్ ప్రకటించిరు. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో ైదు లక్షల రూపాయలను విశాఖలోని రామకృష్ణ మిషన్కు అందించనున్నట్లు చెప్పారు.  టీవీలో తుఫాను బీభత్సాన్ని చూసిన తనకు నోటీ నుంచి మాటలు కూడా రావటం లేదన్నారు. పెద్ద మోత్తంలో మందులు, ఆహార పదార్థాలు, పాలపోడి పంపిణీ చేస్తామన్నారు. అపోలో ఫార్మసీ ద్వారా క్లోరినేషన్, బ్లీచింగ్ సరఫరా చేస్తామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ఏదో ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామని తెలిపారు. తుపాను బాధితులకు సహాయం చేయాలని తన అభిమానులను కోరారు. ప్రభుత్వ ముందుజాగ్రత్త, టెక్నాలజీ సామర్థ్యం, మీడియా సహకారం వల్లే ప్రాణనష్టం తప్పిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు.  అలాగే బాధితులకు ఆహారంతో పాటు మంచినీరు అందించనున్నట్లు రాంచరణ్ తెలిపారు. తుఫానుపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తత చేసినందుకు ఆయన మీడియాను అభినందించారు.

ఆ వెనువెంటనే బాధిత ప్రజల కోసం తాను వున్నానంటూ జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తుపాను బాధితులకు సాయం చేసేందుకు గాను రూ.50లక్షలను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు ప్రకటించారు. తాజా విపత్తు తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఉత్తరాంధ్రపై తుపాను పంజా విసరడం వల్ల లక్షల మంది ప్రజలు బాధితులు అయ్యారనీ.. వారిని ఆదుకునేందుకు తనవంతుగా సాయం చేస్తున్నానని ప్రకటించారు. విపత్తు నుంచి బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. ఈ విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేతులు కలిపి మేమున్నామంటూ ఐక్యంగా బాధితులకు సాయం చేయాలని విన్నవించారు త్వరలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుస్తానని వెల్లడించారు.

ఆ థరువాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్, మహేష్ బాబులతో పాటు సంపూర్ణేశ్ బాబు కూడా వారి విరాళాలను ప్రకటించారు. తుపాను పెను విలయం మిగిల్చిన గాయాలతో భాధపడుతున్న పేదలకు ధైర్యాన్నిచ్చారు. తమ వంతుగా అర్థిక సాయాన్ని అందించారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్.. ఇద్దరూ చెరో ఇరవై లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి అందిస్తామని ప్రకటించారు. మహష్ బాబు కూడా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నట్లు ప్రకటించారు. ఇక ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించిన హీరో సంపూర్ణశ్ బాబు కూడా తన వంతుగా లక్ష రూపాయల సాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పాలు, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసర సరుకులను కూడా అందజేస్తానని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood heros  assistance  andhrapradesh government  declare  donations  cm relief fund  

Other Articles