Modi anounces rs 1000 crores to vizag cyclone hudhud relief works

prime minister, Narendra Modi, anounces, Rs. 1000 Crores,Vizag, Cyclone Hudhud, Relief Works, chandrababu, venkaiah naidu, governer, naradimhan, central minister, ashok gajapathiraju

odi anounces Rs. 1000 Crores to Vizag Cyclone Hudhud Relief Works

విశాఖకు రూ.1000 కోట్ల రూపాయల తక్షణ సాయం

Posted: 10/14/2014 03:51 PM IST
Modi anounces rs 1000 crores to vizag cyclone hudhud relief works

హుదూద్ తుఫానుతో కాకవికళమైన విశాఖపట్నానికి ప్రధాని నరేంద్రమోదీ తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. తుపాను విధ్వంసంతో నిండామునిగిన ఏపీకి సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ విశాఖ వాసులకు అండగా ఉంటానన్నారు. విశాఖలో ఆయన వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెనుతుపానును ధైర్యంగా ఎదుర్కొన్నవిశాఖ వాసులను అభినందించారు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఆకాంక్షించారు.

తుపాను విలయనృతయానికి ధ్వంసమైన విశాఖలో ఆయన పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో మధ్యహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకున్న మోదీ.. 1.52 గంటలకు తుపాను ధాటికి ధ్వంసమైన విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులతో కలసి తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు ఆయన చేరుకుని విధ్వంసాన్ని స్వయంగా పరిశీలంచారు.

అక్కడి నుంచి విశాఖ కలెక్టరేట్ కు చేరుకున్న ప్రధాని.. తుపాను అనంతర పరిస్థితులు, సహాయక చర్యలు, విధ్వంస ప్రభావం తదితర అంశాలపై ప్రభావిత జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. అనంతరం హుద్ హుద్ తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. విశాఖలో విద్యుత్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఉత్తరాంధ్రలో తుపాను నష్టం వివరాలను మోదీకి అందజేశారు.. ప్రధాని పర్యటనలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles