Polling on the way for maharastra haryana assemblies

Narendra modi, amit shah, inld, congress, haryana Polls, maharashtra polls, shivsena, bjp, omprakash chautala, MNS, independents

polling on the way for maharastra, haryana assemblies

ఈవీఎంలలో నిక్షిప్తమవుతున్న ఓటరు తీర్పు..!

Posted: 10/15/2014 08:56 AM IST
Polling on the way for maharastra haryana assemblies

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ కాస్త అలస్యంగా ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బలగాలను మోహరించారు.

ఇక  మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 287 సీట్లలో పోటీ చేయగా, బీజేపీ కూటమి 280, శివసేన 282, ఎన్సీపీ 278, ఎంఎన్‌ఎస్ 219 స్థానాల్లో తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి.  మొత్తం 8.25 కోట్ల మంది ఓటర్లు.. 1,699 మంది స్వతంత్రులు సహా 4,119 మంది అభ్యర్దుల భవితవ్వాన్ని  తేల్చందుకు తీర్పునిస్తున్నారు. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1989 తర్వాత మహారాష్ట్రలోని ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇక్కడ పంచముఖ పోటీతో పాటు పలు నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ కూడా నెలకొంది.

మరాఠాగడ్డను సొంతం చేసుకోవాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకే పార్టీలన్నీ విజయం కోసం శ్రమిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం పావులు కదిపిన పార్టీఃలు.. పాతికేళ్ల తర్వాత ఒంటరిపోరులో నువ్వా-నేనా అంటూ గర్జిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి అధికారం పంచుకున్న కాంగ్రెస్‌కు ప్రజావ్యతిరేకత ఎక్కువగానే ఉంది.. రైతులపై తమ నేతలు చేసిన కామెంట్స్ కూడా ఎన్సీపీని డ్యామేజ్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.. బీజేపీ మిత్రపక్షం శివసేన ఒంటరి పోరు ఫలితాలపై ప్రభావం చూపనుంది.. ఎంఎన్‌ఎస్ కూడా కొంత మేర ఓట్లను చీల్చనుంది.. అన్ని పార్టీలు గెలుపును ఛాలెంజ్‌గా తీసుకున్నాయి.. ప్రచారంలో తమ అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించాయి

అటు హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ తొలిసారిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. 1.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. హర్యానాలో బీజేపీ తొలిసారిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ శ్రమిస్తుండగా‌.. సీటుపై కూర్చోవాలని బీజేపీ కలలు కంటోంది.. ఓం ప్రకాష్ చౌతాలా జైలుకెళ్లడం, ఇటీవలే ఆయన బెయిల్ ను న్యాయస్థానం రద్దు చేయడంతో.. సానుభూతితోనైనా గద్దెనెక్కాలని ఐఎన్ఎల్ డి భావిస్తున్నాయి.

ఇవాళ ఓటరు ఇచ్చిన తీర్పును ఈవీఎంలలో భద్రపర్చి ఈ నెల 19న బహిర్గం చేయనున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. రెండు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19న ప్రధాన పార్టీల భవితవ్యం తేలనుంది.. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాధరణ ఏ మేరకు ఉందో మరోసారి బయటపడనుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజన సృష్టించిన బీజేపీ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో డీలా పడింది.. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశామన్న సంతోషాన్ని నీరుగార్చింది.. 2019లోనూ తమకు తిరుగుండదన్న కమలనాథుల ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు చెక్‌పెట్టారు ఓటర్లు.. జనరల్ ఎలక్షన్స్‌లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీకి బైఎలక్షన్స్‌ కొంత ఊరటిచ్చాయి.. ఇదే ఊపును మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కొనసాగించాలనుకుంటోంది హస్తం.. 2019 వరకు పుంజుకోవాలని భావిస్తోంది..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles