కొద్దికాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.., మన తెలుగు రాష్ర్టాల్లోనే విపరీతాలు, విస్తుగొలిపే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఓ వైపు ప్రకృతి భీభత్సాలు.., మరోవైపు పాలకుల నిర్లక్ష్యాలు. వెరసి తెలుగు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కడుపునండా అన్నం.. కంటినిండా నిద్రపోయిన నెల ఒక్కటి కూడా కన్పించటం లేదు. ప్రజలకు ఎప్పుడూ ఏవో ఒక కష్టాలు.., సమస్యలు వెంటపడుతున్నాయి. ప్రధాన సమస్యలుగా ఉన్న అన్నిటికి మొదట్లోనే మందు వేస్తే ఇబ్బందులు వచ్చేవి కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు, వాటికి సలహాలు ఏమిటో తెలుసుకుందాం.
ముందుగా చెప్పాల్సింది తెలంగాణ సమస్య. తెలుగు ప్రజలనే కాకుండా యావత్ దేశాన్నే ప్రభావితం చేసిందీ అంశం. దేశ రాజకీయ, పాలనా చరిత్రలో ఎన్నడూ ఈ అంశంపై తలెత్తిన ఉద్రిక్తతలు, పరిణామాలు జరగలేదు. ఆత్మబలిదానాలు, ఉద్యమాలు, పోరాటాలు, దీక్షలు, కొట్లాటలు, బంద్ పిలుపులు ఇలా నిరంతరాయంగా చివరి నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ర్టం నిరసనలతో నలిగిపోయింది. వద్దనేవారు ఒకరయితే.., విడిపోతామనేవారు మరొకరు. ఇలా రెండు వైపులా తీవ్రమైన ఉద్యమాలు జరగ్గా.., చివరకు యూపీఏ ప్రభుత్వం వెళ్లిపోయే సమయంలో తెలంగాణను ఇచ్చేసింది. అయితే ఈ సమస్యను ఆదిలోనే పరిష్కరించి ఉంటే అరవై ఏళ్ల పోరాటం జరిగేది కాదు.. వేల ఆత్మబలిదానాలు ఉండేవి కాదు. కేవలం రాజకీయ పార్టీల మనుగడ భయం.., నేతల స్వార్ధ ప్రయోజనాల వల్ల ఇంత ఉద్రిక్తతలు, విద్వేషాలు చెలరేగటానికి కారణం అయింది.
ఇక ప్రకృతి విపత్తులు కూడా తెలుగు వారిని గత ఐదారేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎంతోమంది తుఫానులు, వరదలు, వర్షాల వల్ల మృత్యువాత పడగా.., లక్షల సంఖ్యలో కుటుంబాలు నష్టపోయాయి. అన్ని విపత్తుల్లో కలిపి కోట్ల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. హెలెన్, నీలం, ఫైలిన్, లైలా.., తాజాగా హుద్ హుద్..., పేరేదైనా ప్రతాపం మాత్రం మాత్రం తెలుగువారిపైనే అన్ని దారులు ఆంధ్రవైపే అన్నట్లుగా...విపత్తులన్నీ తెలుగువారిని అందులోనూ ఏపీకి ఎక్కువగా వస్తున్నాయి. తుఫానులు రాజకీయ ప్రభావం, పరిణామాలు కాకపోయినా..., వరదల నుంచి రక్షణ పొందటంలో ప్రభుత్వ పనితీరు.., తుఫానుల ముందస్తు సహాయక చర్యలు, అప్రమత్తతలో పాలకుల ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది.
ఇలా విభజన, విపత్తులు చెప్పుకుంటూ పోతే చాలానే ఇబ్బందులు ఉన్నాయి. అలా అని అన్ని మనకే ఉన్నాయని చెప్పలేము. మిగతా ప్రజలకు ఇబ్బందులు, అన్ని రాష్ర్టాలకు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. కాని తెలుగువారికి మాత్రం ఇవి వెంటవెంటనే వస్తున్నాయి. ఒకటి పోతే మరొకటి అన్నట్లుగా వెంటపడుతున్నాయి. దీనికి కొందరు జాతక నిపుణులు, జ్యోతిష్యులు ఏలినాటి శని ప్రభావం.., గ్రహాల ఫలితం అని చెప్తున్నారు. కాని నాస్తికులు, శాస్ర్తవేత్తలు, విశ్లేషకులు వీటిని కొట్టిపారేస్తున్నారు. విభజన విషయం అయితే రాజకీయ పార్టీల ప్రభావం.., విపత్తులు అయితే ప్రకృతి ప్రకోపం అని చెప్తున్నారు. ఒక్కటిమాత్రం చెప్పగలము అప్రమత్తంగా... తెలివితో వ్యవహరిస్తే ఉంటే అన్నిటిని ఎదుర్కోవచ్చు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more