విదేశీ బ్యాంకుల్లో భారతీయ నల్లకుభేరులు దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం...యూపీఏ బాటలోనే నడించింది. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి దేశంలో అనేక సంస్కరణలు చేపడతామన్న నరేంద్రమోడీ హామీలు గాల్లో దీపాల మాదిరిగానే మారాయి. భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం (డీటీఏఏ) చేసుకున్న దేశాల నుంచి నల్లధనంపై అందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడానికి విదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, బహిర్గతం చేస్తే మరే దేశమూ... భారత్‌తో అటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయదని పేర్కొంది.
ఈ మేరకు 800 అనుబంధ ప్రతులతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించింది. నరేంద్రమోదీ సారథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపి ప్రచారం చేస్తూ విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయలు దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ముందు నల్లధనంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వినిపించారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. లీచ్‌టెన్‌స్త్టెన్‌లోని ఎల్‌జీటీ బ్యాంకులో భారతీయ ఖాతాదారుల పేర్లను బహిర్గతం చేయడంపై జర్మన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన... ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అభ్యంతర తెలిపిన రాంజఠ్మలాని..
ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై సీనియర్ న్యాయవాది రాంజఠ్మలానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విచారించరాదని ధర్మాసనాన్ని కోరారు. ఇటువంటి విజ్ఞప్తి చేయాల్సింది నిందితులు... ప్రభుత్వం కాదు.'' అని జఠ్మలానీ అభ్యంతరం తెలిపారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారిని రక్షించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై తాను ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని, ఆయన స్పందన కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. విదేశాల్లోని బ్యాంకుల్లో దాదాపు రూ. 70 లక్షల కోట్ల నల్లధనం ఉందని ఆయన పేర్కొన్నారు. రాంజఠ్మలానీ విజ్ఞప్తిపైనే నల్లధనం అంశంపై సుప్రీంకోర్టు... ప్రత్యేక దర్యాప్తు బృందా(సిట్)న్ని ఏర్పాటు చేసింది.
విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు వెల్లడించలేమంటూ గతంలో యూపీఏ ప్రభుత్వం వెల్లడించిన ఇదే అభిప్రాయాన్ని అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారి పేర్లను వెల్లడించడానికి డీటీఏఏ అడ్డంకి కాబోదని కోర్టు స్పష్టంచేసింది. ఒప్పందాన్ని సరైన రీతిలో రూపొందించలేదని, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసే అటువంటి ఒప్పందాలను కుదుర్చుకోవద్దని అక్షింతలు వేసింది.
భారత్ నల్లకుభేరుల వివరాలు అందిస్తాం: స్విస్ అధికారులు
తమదేశంలో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల వివరాలను తెలియజేయటానికి స్విట్జర్లాండ్ సమ్మతించింది. ఇటీవల ఆ దేశ పర్యటనకు వెళ్లిన భారతీయ అధికారుల బృందానికి ఈ మేరకు హామీ ఇచ్చింది. భారత్‌లో పన్ను కట్టకుండా స్విట్జర్లాండ్‌కు అక్రమ సొమ్మును తరలించిన భారతీయులపై ఇప్పటికే ఐటీశాఖ దర్యాప్తు జరుపుతోంది. భారత ఐటీశాఖ పరిశీలనలో ఉన్న వారి వివరాలను తెలియజేస్తామని, ఇతరత్రా కేసుల గురించి కూడా అడిగితే సమాచారం ఇస్తామని స్విట్జర్లాండ్ అధికారులు భారతీయ అధికారులకు స్పష్టం చేశారు. తమ చట్టాల మేరకు ఇకనుంచీ క్రమం తప్పకుండా వివరాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more