మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు విడివిడిగా పోటీ చేసినా.. వారి మధ్య పొత్తు కొనసాగాలని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. తాజాగా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు పార్టీల మధ్య శాశ్వత్వ వైరం లేదని, ఇరు పార్టీల నేతలు సామరస్యపూర్వక వాతావరణంలో కూర్చని ఒక అభిప్రాయానికి రావాలన్నారు. ఇరు పార్టీల మద్య మైత్రి చెడితే.. అది ఇరతపార్టీలకు అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం, సభ్యుల సంఖ్య ఏ పార్టీకీ లేకపోవడంతో.. ఇద్దరు కలసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీజేపి- శివసేన పార్టీల మధ్య గత ఇరవై ఐదు ఏళ్ల సాన్నిహిత్యం ఉందన్న విషయం మర్చిపోరాదని అధ్వానీ గుర్తు చేశారు..
మహారాష్ట్రంలో బీజేపి, శివసేనల మధ్య నెలకోన్న పాతికేళ్ల మైత్రి సీట్ల సర్థుబాటు విషయంలో బెటిసికోట్టింది. చివరికి రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినా.. ఈ కూటమిలోని చిన్న పార్టీలకు సరైన సంఖ్యలో సీట్లు ఇవ్వలేన్న కారణంగా బీజేపి శివసేనతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ తిరిగి ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అద్వానీ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్సీపీ(నేషనల్ కాంగ్రెస్ పార్టీ)తో మద్దతు ఏమైనా కోరతారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more