Suspense row over formation of government in maharashtra

NCP, Maharashtra assembly election, BJP, Narendra Modi, modi mania, shiv sena, congress, MNS

Suspense row over formation of government in Maharashtra, Will BJP and Shiv sena share the Power

మహారాష్టలో జతకడతారా..? జారావిడుచుకుంటారా..?

Posted: 10/19/2014 09:55 PM IST
Suspense row over formation of government in maharashtra

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర ఓటరు బీజేపి పక్షాన నిలిచినా.. తీర్పును మాత్రం స్పష్టంగా ఇవ్వడంలో తడబడ్డాడు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవడం అందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులే ఐదుగురు కావడంతో సందిగ్ధంలో  పడ్డ ఓటరు మహాశయుడు.. ఎవరికీ పూర్తిగా మోజారిటీని ఇవ్వలేదు. దీంతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపికి ప్రభుత్వ ఏర్పాటుకు మరో పార్టీ మద్దతు అవసరం కానుంది.

ఈ నేపథ్యంలో తమకు బద్దశత్రువైన కాంగ్రెస్ తో 15 ఏళ్ల పాటు మైత్రిని కొనసాగించి అధికారాన్ని పంచుకున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపితో జతకట్టడానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని అందుకనే బీజేపికి బయటి నుంచి మద్దతు ఇప్తామని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ మొదలుకుని బీజేపి రాష్ట్ర పార్టీ నేతలు ఎన్సీపీపై విమర్శలు వర్షం కురిపించినా..వాటన్నింటినీ కాదని బీజేపితో జతకట్టేందుకు ఎన్సీపీ పరుగులు పెడుతోంది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతిమిర్శలన్నీ ఎన్నికల వరకే పరిమితమని ప్రఫూల్ పటేల్ పేర్కొన్నారు.

ఎన్సీపీ ఇచ్చిన ఆఫర్ ని బీజేపి నిర్ద్వందంగా తిరస్కరించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీ మద్దతు కోరబోమని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసి రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడ్డాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి అవినీతి పార్టీ మద్దతుతో ఎంత వరకు ప్రభుత్వాన్ని నడపగలమని ప్రశ్నించారు.  అందుచేత ఎట్టి పరిస్థితిల్లోనూ ఎన్సీపీ మద్దతు కోరే ప్రసక్తే లేదన్నారు. వారితో పొత్తు పెట్టుకుంటే ఓటేసిన ప్రజలతో పాటు, తమను కూడా అవమానపరుచుకున్నట్లేనని తెలిపారు.

ఎన్నికలలో శివసేన పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం కలలు చెదిరిపోయాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంలేదు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే పాత్ర కీలకంగా మారింది. చిరకాల మిత్రపక్షం, ఈ ఎన్నికలలో విడిపోయి పోటీ చేసిన  బీజేపీకి మద్దతు ఇస్తామని  ఆయన స్పష్టంగా చెప్పడంలేదు. తమ పార్టీ బీజేపికి మద్దతు ఇవ్వాలంటే రెండు పార్టీలు చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని మెలిక పెడుతున్నారు. బీజేపి అతి పెద్దపార్టీగా అవతరిస్తున్నప్పటికీ, ఎవరి మద్దతులేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు కష్టతరంగా మారింది. ఈ అవకాశాన్ని ఉద్ధవ్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పీఃఠాన్ని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. అలా చేస్తేనే కనీసం ఉప ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకైనా బీజేపి అంగీకరిస్తుందని ఆయన భావిస్తున్నారని సమాచారం.

అయితే మహారాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గంటాపథంగా చెబుతున్న బీజేపి, శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో బీజేపి శివసేనలు చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకుంటాయా..? లేక ఎన్నికల ముందు జరిగినట్టుగా బంధాన్ని శాశ్వతంగా తెంచుకుంటారా..? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అదే జరిగితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు లేరని ఎన్సీపీత జతకడతారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP  Maharashtra assembly election  BJP  Narendra Modi  modi mania  shiv sena  

Other Articles