Heart attack risks rest on lifestyle over genetic history researchers say

Heart attack, Heart failure, lifestyle, genetic history, researchers. America, lake salt, intermountain medical center heart institute

Heart attack risks rest on lifestyle, over genetic history, researchers say

వారసత్వానికి.. గుండెపోటుకు సంబంధమే లేదు..!

Posted: 10/22/2014 01:48 PM IST
Heart attack risks rest on lifestyle over genetic history researchers say

గుండెపోటుకు వారసత్వంతో సంబంధం లేదని, అది అసలు వారసత్వంగా సంక్రమించే జబ్బు కాదని అమెరికాలోని ఇంటర్‌మౌంటేన్ మెడికల్ సెంటర్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. గుండెపోటుకు జన్యుపరమైన కారణాలు ఉండే అవకాశం ఉందని, ఒక తరాన్నించి మరొక తరానికి అది విస్తరిస్తుందని ఇప్పటివరకూ భావించిన శాస్త్రవేత్తలు తాజా అధ్యయనాల మేరకు ఈ రెండింటికీ సంబంధమే లేదని తేల్చిచెబుతున్నారు. సమతుల ఆహారం తీసుకోకపోవటం, శారీరక వ్యాయామం చేయకపోవటం, ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది.

ఇంటర్‌మౌంటేన్ మెడికల్ సెంటర్‌కు చెందిన బెంజమిన్ హార్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. గుండెజబ్బు బాధితులపై పరిశోధన జరిపింది. సుమారు ఏడు లక్షల మంది గుండెజబ్బుగ్రస్థులపై అధ్యయనం చేసిన తరువాత గుండెపోటుకు వారసత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రధానంగా గుండెధమనుల (గుండెలోపలు వుండే క్తనాళాల) మాత్రం వారసత్వంగా సంక్రమిస్తాయని చెప్పింది. గుండె దమనులకు గుండెపోటుకు చాలా దగ్గరి సంబంధం వుండటంలో ఇన్నాళ్లు గుండెపోటు వారసత్వంగా వస్తుందని వైద్య శాస్త్రవేత్తలు భావించారు.

గుండెధమనుల సమస్యతో బాధపడుతున్న వారిపై  బెంజమిన్ హార్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దృష్టి సారించి అధ్యయనం చేసింది. ఈ బాధితుల్లో కొందరు గుండెపోటుకు గురైనవారు కాగా.. మరికొందరికి ఆ సమస్య ఎదురు కాలేదు. ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు.. కరోనరీ వ్యాధి వారసత్వంగా సంక్రమిస్తోందని తేల్చారు. కానీ.. గుండెపోటు ఆ విధంగా రావటం లేదని గుర్తించారు. దీనిపై హార్న్ మాట్లాడుతూ.. ''కరోనరీకి, గుండెపోటుకు మధ్య దగ్గరి పోలికలు ఉండటం వల్ల అవి రెండూ ఒకటేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కరోనరీ సమస్య ఉందంటే అది గుండెపోటుకు దారితీస్తుందనే అభిప్రాయం నెలకొంది. కానీ ఇది వాస్తవం కాదు. ఇవి రెండూ వేర్వేరు'' అని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles