Minor student found pregnant at a govt school was exploited by a tea seller

Minor student found pregnant at a govt school, was exploited by a tea-seller

Minor student found pregnant at a govt school, was exploited by a tea-seller

4 నెలలుగా అత్యాచారం..7వ తరగతి విద్యార్థిని గర్భవతి

Posted: 10/22/2014 09:29 PM IST
Minor student found pregnant at a govt school was exploited by a tea seller

సభ్యసమాజం తలదించుకునేలా 7వ తరగతి చదవుతున్న మైనర్ బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు ఆ కామాంధుడు. అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని గోపాల్ గంజ్ ప్రాంతంలో వున్న నారాయణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదవుతున్న ఏడవ తరగతి విద్యార్థి తనకు తీవ్రమైన కడుపునోప్పి వస్తుందని ఉపాధ్యాయులతో చెప్పింది. ఉపాధ్యాయులు అసిడిటీ సమస్య అనుకుని మాత్రలు ఇచ్చారు. మరునాడు కూడా కడుపునోప్పి వస్తుందని చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రలకు సమాచారం అందించారు. వారు రాగానే అస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.

బాలికక పరీక్షలు నిర్వహించిన వైద్యుల అసలు విషయం చెప్పారు. బాలిక గర్భవతని, దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. తీరా విద్యార్థిని అరా తీస్తే.. స్థానికంగా టీ అమ్మకునే నరేస్ మదేస్య అనే వ్యక్తి తన కూతరు వయస్సున్న్ మైనర్ బాలికపై గత నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక చెప్పింది. టీ పోస్తానని ఆశ చూపి తనను లొంగదీసకున్నట్లు బాలిక విలసిస్తూ చేప్పింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం బయటపడిందని తెలుసుకున్న నిందితుడు పరారీలో వున్నాడు.

ఈ ఘటనపై త్వరగా దర్యాప్తు జరపి, నిందితుడిని అరెస్టు చేయాలని తాను స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు గోపాల్ గంజ్ ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. రెక్కడితే గాని డొక్కాడని బాలిక తల్లిదండ్రులు కడుబీద వారని.. తమ జీవనం గడవటానికి వారు అతికష్టమైన పనులు చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. బాలికకు టీ పోస్తానని ఆశచూపి నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేయడాన్ని మహిళా సంఘాలు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles