The big mistakes of uddhav thackrey which abstruct to win his shivsena party and his political career

uddhav thackrey, shivsena party, uddhav thackrey shivsena party news, shivsena party loss, maharashtra assembly elections, uddhav thackrey mistakes, bjp party news, narendra modi, saamna news paper, bal thackrey

the big mistakes of uddhav thackrey which abstruct to win his shivsena party and his political career

శివసేన అధికారంలోకి రాకుండా అడ్డుకున్న ఉద్ధవ్ తప్పిదాలు!

Posted: 10/22/2014 09:57 PM IST
The big mistakes of uddhav thackrey which abstruct to win his shivsena party and his political career

మహారాష్ట్ర ప్రజాసేవకోసం 1966లో బాల్ థాక్రే నిర్మించిన శివసేన పార్టీ.. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఎంతో గౌరవపరంగానే సాగుతూ వచ్చింది. ఆయన మరణించేముందు వరకు రాజకీయరంగంలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు వుండేది. ఆ గుర్తింపుతోనే ఆ పార్టీ నిన్న మహారాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 73 స్థానాలను గెలుచుకోగలిగింది. నేడు శివసేనకు అంత భారీ మెజార్టీ రావడానికి కారణం కేవలం బాల్ థాక్రేనే అని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ.. ఉద్ధవ్ థాక్రే వ్యవహరించిన తీరుని చూస్తే.. ప్రస్తుతం ఆ పార్టీ గందరగోళ పరిస్థితిలో మునిగిపోయే ప్రమాదం వుందని తెలుస్తోంది. ఉద్ధవ్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల భవిష్యత్తులో ఈ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు చాలావరకు వున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఆయన చేసిన తప్పులేమిటో ఒకసారి చూస్తే...

1. తానే సీఎం అంటూ ప్రచారం చేసుకోవడం :

బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని వున్న రోజుల్లో అంతా సవ్యంగానే జరిగింది కానీ.. తర్వాత సీట్ల లెక్కింపు విషయంలో విభేదాలు రావడంతో విడిపొయ్యాయి. అయితే విడిపోవడానికి ముందే ఆయన ఎన్నికల్లో గెలిస్తే తానే సీఎంనంటూ ప్రచారం చేసుకున్నాడు. బహుశా ఈ వ్యవహారం నచ్చకపోవడం వల్ల బీజేపీ ఆ పార్టీతో విడిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం బీజేపీ అధికారంలో వుంది కాబట్టి.. దేశవ్యాప్తంగా తమ పార్టీయే అధికారం చెలాయించాలని భావిస్తోంది. పైగా మోదీ హవా ఎక్కువగా వున్న నేథ్యంలో తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయనే నమ్మకంతో ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం తమ పార్టీ తరఫునే సీఎం అభ్యర్థిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్ధవ్ తానేనంటూ సీఎంగా ప్రకటించడంతో బీజేపీ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుందనే అనుమానాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆ శివసేన పార్టీకి బీజేపీ రూపంలో కాస్త వ్యతిరేకత భావం ప్రజల్లోకి వచ్చేసింది. అతను స్వార్థపరుడనే అభిప్రాయాలూ వెలువడని సందర్భాలున్నాయి కూడా!

2. పట్టుదల :

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మోదీ హవాయే ఎక్కువగా కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఆయన మీద నమ్మకంతో బీజేపీ పార్టీకే ఓట్లు వేస్తూ గెలిపిస్తూ వస్తున్నాయి. పైగా జాతీయ స్థాయి పార్టీ కావడంతో మహారాష్ట్ర ప్రజలు ఆ పార్టీనే గెలిపించారు. కానీ ఈ విషయాన్ని ఉద్ధవ్ ముందే గ్రహించలేకపోయాడు. ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన.. బీజేపీతో పొత్తు వున్న సమయంలో కాస్త పట్టుదల భావాన్ని వ్యక్తపరిచాడు. కేవలం నాలుగైదు సీట్ల లెక్కింపు విషయంలో ఇతను వెనక్కి తగ్గకపోవడం వల్ల బీజేపీ వీరితో విడిపోవాల్సి వచ్చింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 130 స్థానాలు తమకు, 140 శివసేనకంటూ ఒప్పందం కుదుర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది కానీ ఉద్ధవ్ మాత్రం అలా ఒప్పుకోలేదు. తాను 115 - 117 స్థానాలు మాత్రమే బీజేపీకి కేటాయిస్తామంటూ పట్టుదల బిగించారు. దీంతో ఆ పార్టీ తెగదెంపులు చేసుకుంది. ఈ పట్టుదల వ్యవహారమే ప్రజలకు కాస్త అనుమానాన్ని రేకెత్తించింది.

3. వారసత్వ పరిపాలన :

నిజానికి శివసేన పార్టీ ప్రస్థానం చాలా పాతదే అయినా.. ఉద్ధవ్ థాక్రేకి మాత్రం రాజకీయ అనుభవం లేదు. ఇతను ఎన్నడు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తండ్రి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టాడే తప్ప.. గతంలో రాజకీయ వ్యవహారంలో ఏమాత్రం అనుభవం లేదు. ఇటువంటి నేపథ్యంలో అతను తన కొడుకును కూడా రాజకీయ రంగంలోకి దించేశాడు. బీజేపీ పార్టీ మీద వ్యతిరేకంగా అతని ద్వారా ప్రసంగాలు చేయించాడు. దీంతో ఇంకా రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఇప్పుడు తన స్వార్థం మేరకు వారసత్వ పరిపాలనను రంగంలోకి దించాడంటూ ఆరోపణలు కూడా వచ్చేశాయి. ఆయన చేసిన తప్పులో ఇది పెద్దదనే చెప్పుకోవచ్చు.

4. సత్సంబంధాలు లేకపోవడం :

బీజేపీ - శివసేన పార్టీ పాతిక సంవత్సరాల స్నేహబంధం వున్న విషయం తెలిసిందే! అప్పటి విషయాలు కాస్త పక్కనపెడితే.. ఈ రెండు పార్టీలు ఇంకా విడిపోకముందు ఎన్నికల నేపథ్యంలోగానీ.. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి రాజకీయ వ్యవహారాలపై చర్చించేందుకు ఉద్ధవ్ థాక్రే మోదీతోగానీ ఇతర పార్టీ నాయకులతో అస్సలు కలవలేదు. తన పార్టీయే గెలుస్తుందన్న ధీమాతో వున్న ఉద్ధవ్.. మోదీతో కలవాల్సిన అవసరం లేదని భావించాడు. అతను ముందునుంచే బీజేపీ పార్టీతో అంతగా సన్నిహితంగా వుండేవాడు కాదు.. ఈ విషయం ముందే తెలియదు కానీ.. తర్వాత తెలిసినప్పుడు బీజేపీ తమ జాగ్రత్త తాము చూసుకుంది.

5. బీజేపీ - మోదీ మీద అసత్య ప్రచారాలు :

బీజేపీతో పొత్తు విడిపోయిన అనంతరం ఉద్ధవ్ థాక్రే ఆ పార్టీ మీద మోదీ మీద అసత్య ప్రచారాలు చేయడం పెద్ద మైనస్ పాయింట్ గా మిగిలింది. అతనితో మిగతా పార్టీలు కేవలం మోదీని టార్గెట్ చేసుకునే అసత్య ప్రచారాలు చేసిన నేపథ్యంలో.. మోదీ హైలైట్ అయ్యారు. బంధాలు తెగిపోవడంతోపాటు ఇలా అందరూ మోదీని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన పార్టీయే ఎక్కువ మెజార్టీతో గెలుచుకోగలిగింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఉద్ధవ్ మోదీతో పాటు ఆయన తండ్రిని కూడా ఎటువంటి అర్థం లేకుండా తన ప్రచారాల్లోకి లాగడం విశేషంగా నిలిచిపోయింది.

6. రాజకీయ అనుభవం :

ఇదివరకే చెప్పుకున్నట్టు ఉద్ధవ్ థాక్రేకి రాజకీయ అనుభవం అస్సలు లేదని తెలుసుకున్నాం. అటువంటి సమయంలో కాస్త ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇతను అడుగులు వేసి వుంటే బహుశా సీఎం అయ్యే అవకాశం వుండేది. అదెలా అంటారా..? గతంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా తమ పార్టీని కూడా బరిలోకి దించివుంటే అప్పుడే ఆ పార్టీ సత్తా, నాయకుడి నమ్మకం ఏంటో ప్రజలు తెలుసుకునేవారు! అప్పుడు గెలుపోటములతో సంబంధం లేదు. ఒకవేళ గెలిస్తే.. ఆ పార్టీ అందరికీ తెలిసి వుండేది. అలాకాకుండా ఓడిపోయి వుంటే తమ పార్టీ కూడా ఎన్నికల బరిలో వుందంటూ ప్రచారం చేసుకోవడానికి వీలుగా వుండేది. తద్వారా ఎలాగోలా శివసేన పార్టీ పేరు కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలిసేది. అప్పుడా సమయంలో పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా వుండేది. ఆ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే తన రాజకీయ అనుభవాన్ని కూడా పొందేవారు. కానీ ఇవేమీ లేకుండా సీఎం పదవి కోసం నేరుగా ప్రధాని మోదీ మీదే వ్యతిరేకంగా మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏవిధంగా అయితే మోదీ వారణాసిలో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారో.. అదేవిధంగా ఉద్ధవ్ థాక్రే కూడా కనీసం ప్రయత్నం చేసి వున్నా రాజకీయపరంగా తనకూ ఓ అనుభవం వుండేది కదా అంటూ విశ్లేషకలు అభిప్రాయం!

7. అహంకార భావన :

ఇదివరకు చెప్పుకున్నదంతా గతం! ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తర్వాత అయినా ఉద్ధవ్ థాక్రే తన రాజకీయ పరిస్థితి గురించి ఆలోచించి వుండాల్సింది! ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ ఏకంగా 122 సీట్లను గెలుచుకోగా.. శివసేన కేవలం 62 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో బీజేపీకే ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి. ఈ విషయం ఉద్ధవ్ ముందే గ్రహించి తన పార్టీని బీజేపీలో విలీనం చేసి చాలా బావుండేది. తనకు రాజకీయ పదవి లభించడంతోపాటు భవిష్యత్తులో రాజకీయ అనుభవాన్ని పునికి తెచ్చుకునేవాడు. కానీ అలా చేయకుండా ఇప్పటికీ ఆ పార్టీ మీద అహంకార భావంతో పొత్తు కలుపుకోకుండా మోదీ-బీజేపీ మీద దాడి చేయడాన్ని కొనసాగిస్తూనే వున్నారు. అలాగే తన ‘‘సామ్నా’’ పత్రికలో కూడా మోదీకి వ్యతిరేకంగా అహంకార కథనాలు ప్రచురించడం జరిగింది. ముందుగా సీఎం అవుతానని కలలు కన్న ఉద్ధవ్ కు ఇప్పుడు డిప్యూటీ సీఎంగానే కాదు.. సగం స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇంకా దాడి కొనసాగిస్తూనే వున్నారు. ఈ సమయంలో బీజేపీ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే.. రానురాను ఆ పార్టీ అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఒక్కొక్కరు ఆ పార్టీలోకి జంప్ అవడం ప్రారంభిస్తారు. తద్వారా బీజేపీ ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో శివసేన ఆ పార్టీని ఎంత దిగజార్చాలన్నా అస్సలు కుదరదు. పైగా అది మరింత బలపడుతూ ముందుకు కొనసాగుతూనే వుంటుంది.

ఇలా ఈ విధంగా ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయాలే ఆయనకు శాపంగా మారినట్లు కనిపిస్తున్నాయి. నిజానికి బీజేపీ - శివసేన పార్టీలో ఇంకా పొత్తుపెట్టుకునే వున్నాయనే ధ్యాసతోనే ప్రజలు చాలావరకు బీజేపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం.. బీజేపీ ఇప్పుడు ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ఇది శివసేనకు చాలా గట్టి దెబ్బే. ఇటువంటి పరిస్థితుల్లో శివసేనలో వుండే ఎమ్మెల్యేలందరూ బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని మరో సమాచారం! మరి ఉద్ధవ్ తన రాజకీయ భవిష్యత్తును ఇకనుంచి ఎలా కాపాడుకుంటూ వస్తారో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles