Haryana cm manohar lal khattar assets and biography

manohar lal khattar biography, manohar lal khattar assets, manohar lal khattar marriage, manohar lal khattar comments, haryana chief minister, maharastra chief minister, haryana, maharastra elections results, latest telugu news

haryana cm manohar lal khattar biography : haryana chief minister manohar lal khattar is the first person from non jhat person who become chief minister for haryana with first entry to assembly only he become chief minister in affidavit manohar says he is not married and have no vehicle

గ్రేట్ ! సొంతంగా వాహనం లేని వ్యక్తి సీఎం అయ్యాడు.

Posted: 10/23/2014 08:27 AM IST
Haryana cm manohar lal khattar assets and biography

ఈ రోజుల్లో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అయితేనే కార్లలో తిరుగుతున్నారు. ఏ పదవి లేకపోయినా రాజకీయాల్లో ఉండి కోట్లు సంపాదిస్తున్నారు. కాని ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం సొంతంగా వాహనం లేదు అంటే నమ్ముతారా. కాని ఇది నిజం హర్యానా కొత్త ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సొంతంగా వాహనం కూడా లేదు. కాంగ్రెస్ ను పారద్రోలి బీజేపికి పట్టం కట్టడానికి గల కారణాలపై సర్వే చేసిన సంస్థలకు ఖట్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అవేమిటో మనం కూడా చూద్దాం.

రాష్ర్టంలో ఓ వారసత్వంగా వస్తున్న జాట్ సామాజిక వర్గ ముఖ్యమంత్రి పీఠంను తొలిసారి జాట్ యేతర వ్యక్తిని వరించింది. ఆయనే మనోహర్ లాల్ ఖట్టర్. అంతేకాదు అసెంబ్లీకి ఎన్నికైన తొలి సారే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి.., అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే అసెంబ్లీకి కొత్త అయినా రాజకీయ అనుభవం మాత్రం చాలా ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్, బీజేపి నేతగా సుదీర్ఘ కాలం ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు. సామాన్యుల కష్టాలను దగ్గరినుంచి చూసిన స్వీయ అనుభవం ఉంది.

రైతే రాజయ్యాడు

ఢిల్లీ యునివర్సిటీ నుంచి డిగ్రీ చదివి.., ట్యూషన్లు చెప్పాడు, తనకున్న 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశాడు. ఖట్టర్ ఎన్నికల అఫిడవిట్ లో తానో కర్షకుడిగా చెప్పుకున్నారు. ఆయన ఆస్తుల వివరాలు చూస్తే.., రోహ్తక్ జిల్లా బిన్యానీలో వారసత్వంగా వచ్చిన రూ.50లక్షల విలువ చేసే 20ఎకరాల భూమి ఎంది. దీనితో పాటు రూ.3లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. అదేవిధంగా 2013-14 ఆర్దిక సంవత్సరానికి తన ఆదాయం రూ.2.73లక్షలుగా తెలిపారు. అంటే ఇదంతా వ్యవసాయం నుంచి వచ్చేదే అన్నమాట. ఇక తనకు సొంతంగా ఏ వాహనం లేదు అని అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

పెళ్ళి కాలేదు-కేసు లేదు

మరో ముఖ్య విషయం ఏమిటి అంటే ఖట్టర్ కు ఇంకా పెళ్లి కాలేదు. అంతేకాదు ఆయనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ కాలంలో మామూలు కార్యకర్తలపై కూడా ఒకటి, రెండు కేసులు ఉండటం సహజం. రాజకీయాల్లో కేసులను చూసి కూడా పదవులు ఇస్తున్నారు. అలాంటిది ఈయనపై ఒక్క కేసు కూడ లేకపోవటం విశేషం. అంతమాత్రాన ఖట్టర్ పోరాటాలు చేయలేదు అని కాదు. కాని ఓ పద్దతి ప్రకారం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. అందుకే కేసులు పెట్టడానికి కూడా అవకాశం లేదు.

రాష్ర్టానికి వైద్యం చేస్తాడు

చిన్నపుడు డాక్టర్ కావాలని మనోహర్ కలలు కనేవాడట. అందరికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలని అని భావించేవాడు. కాని పరిస్థితులు, ఎదురైన పరిణామాల ఫలితంగా సంఘ్ లో చేరి ప్రచారక్ గా జీవితాన్ని అంకితం చేశారు. అలా ట్యూషన్లు చెప్పి.., విద్యార్థులకు దేశం గురించి మంచి మాటలు చెప్పిన ఓ ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రజలను పాలించే నాయకుడు అయ్యాడు. ఊర్లో వ్యవసాయం చేసుకున్న రైతు హర్యానా రాష్ర్టానికి రాజు అయ్యాడు. ఇంకా చెప్పాలంటే వైద్యుడుగా ప్రజలకు సేవ చేద్దామనుకుని ఇప్పుడు ఏకంగా రాష్ఱ్రాన్నే కాపాడే గొప్ప వైద్యుడు అయ్యాడు. ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గురించి చదువుకున్నాం. కాని.., ఇప్పుడు ఖట్టర్ ను చూస్తుంటే కూడా అదే సాధాసీదా జీవితం గుర్తుకువస్తుంది. గ్రేట్ సీఎం..., హ్యాట్సాఫ్ టు యు.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manohar lal khattar  haryana  chief minister  latest news  

Other Articles