హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆకాశం మేఘావృతమైంది. రాగల 24గంటల్లో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వానలు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రం నుంచి కొంకణ్ మీదుగా... దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో పలుచోట్ల, తెలంగాణ, రాయలసీమలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముంది.
ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజమాల, అవుకు మండలాలలో భారీగా వర్షం కురిసింది. కోయిలకుంట్ల-అవుకు మధ్య పాలేయ వాగు పొంగిపొర్లుతోంది. వెలిగోడు మండలం మార్లమడికి సమీపంలో వేదావతి నది పొంగిపొర్లుతోంది. బళ్లారి, కర్నూలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 856.40 అడుగులకు చేరుకుంది. లెప్ట్ పవర్ హౌస్లో శనివారం రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇరిగేషన్ అధికారులు సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,280 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మండలాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ మండలాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలలో ఏలూరుతోపాటు పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడ్డాయి.
పశ్చిమ మధ్య, నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. వాయుగుండం క్రమంగా ఒమన్ వైపు తరలిపోతుందని, దీని వల్ల భారత దేశానికి ఎలాంటి ప్రమాదం ఉండదని తుపాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురిచెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈశాన్య దిశ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గాలులు వీస్తున్నందున ... ఏపీ, తెలంగాణలో చలి వాతావరణం కొనసాగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more