Powerful solar flare erupted friday from largest sunspot in 24 years

Powerful Solar Flare, Erupt, Largest, Sunspot, 24 Years, X3

Powerful Solar Flare Erupted Friday From Largest Sunspot In 24 Years

సూర్యుడిపై భారీ విస్పోటనం.. మానవ శాటిలట్స్ కు ప్రమాదం

Posted: 10/26/2014 02:19 PM IST
Powerful solar flare erupted friday from largest sunspot in 24 years

సూర్యుడి ఉపరితలంపై ఏర్పడిన భారీ సన్ స్పాట్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన కెమెరాలో బంధించింది. నాసాలోకి సోలార్ డైనమిక్స్ అబ్సర్వేటరీ లాబ్ లో అమర్చిన కెమరా ఈ ఫోటోను తీసింది. సౌర వాతావరణంలో ఏర్పడే అయస్కాంత శక్తి ఒక్కసారిగా బయటికి వచ్చే ప్రయత్నంలో ఏర్పడే పేళుల్లే సోలార్‌ ఫ్లేర్స్ అని అంటూరు శాస్త్రవేత్తలు‌. వీటిని ఎక్స్‌ క్లాస్‌ స్థాయుల్లో వెల్లడిస్తారు. తాజాగా సంభవించిన ఫ్లేర్‌ ఎక్స్‌-త్రీ స్థాయిదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ ఎక్స్ 1 సోలార్ ప్లేర్ కి ఇది మూడింతల శక్తిని ఇమిడివుంటుందన్నారు. ఇది సూర్యునికి ఎడమ వైపు నుంచి కుడి వైపుకు ఈ నెల 18న సంచరించిందని.. ఆ తరువాత శుక్రవారం ఇది స్యూరుడి నుంచి భయటకు వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఫ్లేర్స్‌తో బాటే అత్యధిక స్థాయిలో రేడియేషన్‌ కూడా ఖగోళంలోకి విడుదల అవుతుందన్నారు. వాటి స్థాయులను బట్టి భూమి వాతావరణం ఈ రేడియేషన్‌ను శోషించుకుంటుంది.

అయితే రేడియో, జీపీఎస్‌ తరంగాలపై ఇది ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అంతేకాదు మానవులు పంపిన ఉపగ్రహాలపై కూడా వీటి ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాస్తవానికి ఈ వారంలో దాదాపు ప్రతిరోజూ సోలార్‌ ఫ్లేర్స్‌ సంభవిస్తూనే ఉన్నాయట. కానీ తాజాగా ఏర్పడిన సోలార్‌ ఫ్లేర్‌ను గడిచిన 24 సంవత్సరాలలో చూడలేదని నాసా సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) పేర్కొంది. ఈ సన్ స్పాట్‌ (సూర్యుడిపై మచ్చ)ను నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వ్యోమనౌక గుర్తించింది.

ఏఆర్ 12192 అనే భారీ క్రియాశీలక ప్రాంతంలో సంభవిచిన ఈ సోలార్ ఫ్లేర్ తో ఇప్పటివరకు ఎక్స్ 3.2 స్థాయి సౌరకీల (సోలార్ ఫ్లేర్) ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో అక్టోబర్ 19 నుండి ఎక్స్ తరగతి కీలలు వెలువడటం ఇది నాలుగోసారి. ఎక్స్ అనేది అత్యంత తీవ్ర సౌర కీలలకు చిహ్నం. ఆ తర్వాత సంఖ్య దాని బలాన్ని సూచిస్తుంది. ఈ సూర్యుడి మచ్చ వెడల్బు 80వేల మైళ్ల మేర ఉంది. ఇందులో భూమి లాంటి గ్రహాలు పది ఇముడుతాయి. సౌర కీలలు.. రేడియో ధార్మికతకు సంబంధించిన శక్తిమంతమైన విస్ఫోటాలు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Powerful Solar Flare  Erupt  Largest  Sunspot  24 Years  X3  

Other Articles