Lava from hawaii volcano edges closer to dozens of homes on the big island

volcanic-eruption, disaster, emergency-planning, community-and-society, Hawaii, united-states, volcano, eruption, Kilauea mountain

Lava from Hawaii volcano edges closer to dozens of homes on the Big Island

పహో పట్టణాన్ని కబళిస్తున్న కిలౌయ్యా పర్వత లావా..

Posted: 10/30/2014 03:56 PM IST
Lava from hawaii volcano edges closer to dozens of homes on the big island

చిన్న నదీ ప్రవాహంలా  నిప్పలు చిమ్ముతూ నెమ్మదిగా ముందుకు కదులుతున్న దానిని చూసి స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గంటలకు 14 మీటర్ల చొప్పున ముందుకు కదులుతున్న లావా తమ ఇళ్లను ఏమీ చేయకుండా చూడు భగవంతుడా అని వారు దేవుడికి నమస్కరిస్తున్నారు. హావాయ్ లో కిలయియీ అగ్నిపర్వతం బద్దలు కావడంతో అందులోంచి భగభగ మండుతున్న లావా భయటకు వస్తోంది. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి కరిగిన లావా నమ్మదిగా హవాయ్ లోని పెద్ద ద్వీపానికి చేరువుగా కదులుతోంది. ఈ దారిలో వున్న పలు ఇళ్లపై ముందుగా అధి ప్రభావం చూపనుంది. సముద్ర తీరాన వున్న పెద్ద ద్వీపం (బిగ్ ఐలాండ్) పట్టనంలోని డజన్ల కోద్ది గృహాలను, వ్యాపార సముదాయాలను కబళించేందుకు సిద్దంగా వుంది.

ఇప్పటికే దారిలో వున్న ఓ నివాస భవనాన్ని చుట్టుముట్టిన లావా.. మరో నివాసయోగ్యం కాని గృహాంలోకి కూడా చోచ్చుకువెళ్లింది. ఈ క్రమంలో లావా రోడ్డు సహా పలు ఆస్తులను విధ్వంసం చేసింది. ప్రస్తుతం లావా పహో గ్రామ రోడ్డుకు వరకు చేరుకుందని, ఇక్కడ 800 నివాసాలు వున్నాయని హావాయ్ ఢిఫెన్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. పహో గ్రామంలోని దక్షిణ భాగంలో వున్న ఇళ్లు ప్రమాదపుంచున వున్నాయన్నారు. ప్రారంభంలో లావా చిన్నదిగా వున్నా.. ఇంకోన్న రోజుల పాటు లావా ఉప్పోంగితే.. దాని విస్తీర్ణం కూడా పెరుగుతుందని అధికారుుల తెలిపారు.

లావా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు 900 డిగ్రీల సెల్సియస్ వేడితో భగభగ మండుతూ గ్రామం వైపు దూసుకువస్తుందన్నారు. లావా వేళ్తున్న మార్గంలో ఇళ్లలో ఫర్నిచర్ సహా అన్నింటినీ తోలగించామన్నారు. ఇప్పటి వరకు లావా ఏ ఇతర రూపాన్ని తీసుకోకపోవడంతో తాము  చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లావా మార్గంలో వున్న ఓ ప్రాథమిక పాఠశాలతో పాటు మరో నాలుగు పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్వత విస్పోటనం 1983 నుంచి కోనసాగుతుందని కాగా తాజాగా బద్దలైంది మాత్రం జూన్ 27 నుంచని అధికారులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles